Begin typing your search above and press return to search.
జగన్ - పవన్ కలిస్తే బాబుకు డిపాజిట్ కల్ల..
By: Tupaki Desk | 29 May 2018 7:15 AM GMTదేవుడు దెయ్యమయ్యాడు.. దెయ్యమే దేవుడైంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు - మిత్రులు ఉండరనడానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులే నిదర్శనం.. మొన్నటివరకు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఈగవాలనివ్వని మోత్కుపల్లి ఇప్పుడు బట్టలూడదీసి నగ్నంగా నిలబెట్టేలా మాట్లాడేస్తున్నారు. కేసీఆర్ ను బండబూతులు తిట్టిన మోత్కుపల్లి అదే నోటితో కేసీఆర్ అంతటి మగాడు - పరిపాలన దక్షుడు లేడంటున్నారు. అధికారమే పరమావధి అయిన నేటి సమకాలీన రాజకీయాల్లో మోత్కుపల్లి లాంటి జెండా మోసే నిజాయితీ గల నాయకులకు చోటే లేకుండా పోతోంది. ఇలా పార్టీని నమ్మి మోసపోయి తన ఆవేదనను వెళ్లగక్కడం ప్రస్తుతం రాజకీయాలను షేక్ చేస్తోంది..
తాజాగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు - మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన మోత్కుపల్లి అన్నగారికి నివాళులర్పించారు. అనంతరం ప్రస్తుత తెలుగుదేశం పార్టీ దుస్థితి - చంద్రబాబు తీరును తట్టుకోలేక భోరుమన్నారు. చంద్రబాబు తనను మోసం చేశాడని.. నమ్మి ఇన్నాళ్లు ఉంటే పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
ఇక ఈరోజు మంగళవారం మోత్కుపల్లి చేసిన వ్యాక్యలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి... చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాడంటే దానికి కారణం బీజేపీ - జనసేననే అని మోత్కుపల్లి స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీచేస్తే చంద్రబాబు గెలిచేవాడే కాదని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికి కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ - జనసేనాని పవన్ కళ్యాన్ లు పొత్తుపెట్టుకొని గనుక పోటీ చేస్తే చంద్రబాబుకు ఒక్కటంటే ఒక్కసీటు కూడా రాదని .. డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. చంద్రబాబును ఓడించాలంటే పవన్-జగన్ కలిసి పోటీ చేయాలని మోత్కుపల్లి సూచించారు.
ఇక మోత్కుపల్లి చేసిన తాజా ప్రకటన ఏపీ సీఎం చంద్రబాబును కలవరపెడుతోంది.. చంద్రబాబు మోసాలపై తాను రథయాత్ర చేసి మరీ ఆంధ్రప్రదేశ్ లో బాబు మోసాలను వాడవాడలా తిరిగి ప్రచారం చేస్తానని మంగళవారం మోత్కుపల్లి ప్రకటించడం సంచలనమైంది. టీడీపీ మాజీ నేత .. ఇలా తెలుగుదేశం పార్టీ గురించి, ఆ పార్టీ అధినేత గురించి అనువణువూ తెలిసిన వ్యక్తి ఏపీలో వాస్తవాలు వెల్లడిస్తే ఏమవుతుందోనన్న ఉత్కంఠ టీడీపీని కుదిపేస్తోంది. నాడు ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు హయాం వరకు అన్నింటికి మౌన సాక్షిగా ఉన్న మోత్కుపల్లి ఏపీలో రథయాత్ర చేస్తే అంతకుమించిన డ్యామేజ్ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
ఇలా గవర్నర్ చేస్తానన్న చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేయడంతో పార్టీనే నమ్ముకొని ఉన్న మోత్కుపల్లిలో ఆగ్రహం కట్టలు తెచ్చింది. కనీసం గవర్నర్ గిరి ఇవ్వకున్నా ఏదైనా నామినేటెడ్, కనీసం రాజ్యసభ సీటు అయినా ఇచ్చే వీలున్నా.. చంద్రబాబు పట్టించుకోలేదని మోత్కుపల్లి వాపోయాడు.. అందుకే రగులుతున్న అగ్ని పర్వతంలా ఉన్న మోత్కుపల్లి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బద్దలయ్యాడు. ఆ ఆగ్రహ జ్వాలలు ఇప్పుడు చంద్రబాబును బలంగా తాకుతున్నాయి. దీంతో మోత్కుపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా మోత్కుపల్లి వెనక్కి తగ్గకుండా బాబుపై పోరాటానికి దిగడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా చంద్రబాబు మోసాలపై ఏపీలో రథయాత్ర చేస్తానని మోత్కుపల్లి ప్రకటించడం తాజాగా హాట్ టాపిక్ అయ్యింది.