Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరి టార్గెట్ కేసీఆరే
By: Tupaki Desk | 24 Dec 2017 1:30 PM GMTమాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ అరెస్టు ఎపిసోడ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అన్నివర్గాలు టార్గెట్ చేసుకునే స్థాయికి చేరింది. ఇప్పటికే ఎమ్మార్పీఎస్ నాయకులు స్వతంత్రంగా అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తుండగా..తాజాగా వారికి టీఆర్ ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు తోడయ్యాయి. తాజగా "ప్రజాసంఘాల నిర్బంధం" అనే అంశంపై సోమజిగుడ ప్రెస్ క్లబ్ లో అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మరియు అన్ని ప్రజాసంఘాల ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ నుండి మోత్కుపల్లి నర్సింహులు - బీజేపీ నుండి చింత సాంబమూర్తి - తెలంగాణ ఇంటి పార్టీ నుండి చెరకు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అరెస్ట్ ను ఖండించారు.
మందకృష్ణ అరెస్టు - అక్రమ కేసులను నిరసిస్తూ ఈనెల 27న బంద్ కు పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ తెలిపారు. మంద కృష్ణను ఆయనతో పాటుగా, దళితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసులు అన్ని విత్ డ్రా చేసుకోవాలని...సమష్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని తీర్మానం చేశామని వివరించారు. టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ `మంద కృష్ణను ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు జైల్లో పెట్టారు? మాదిగ కులస్తులను జైల్లో పెట్టదలుచుకున్నారా?` అని ప్రశ్నించారు. మంద కృష్ణను విడుదల చేయాలని, కేసులు వెనక్కి తీసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నాడని పేర్కొంటూ....నియంత పాలన చిరకాలం ఉండదని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో టీఆర్ ఎస్ ను ఓడించి దళితులు కేసీఆర్ బుద్ది చెప్పుతారని అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే వర్గీకరణ చేయబోనని చెప్పాలని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. క్యాబినెట్ లో ఒక్క మాదిగ కులస్తులకు చోటు లేదని, కేసీఆర్ క్యాబినెట్ లో మాదిగ - మాల కులస్థులతో పాటు మహిళను కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాంను పొగుడుతున్న కేసీఆర్ అదే నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వర్గీకరణ చేయించడానికి సిద్ధంగా ఉన్నారని...కేంద్రం సిద్ధంగా ఉందనే విషయం ఆయన వెల్లడించారని మోత్కుపల్లి తెలిపారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి వర్గీకరణ చేయించాలని సూచించారు.
టీఆర్ ఎస్ పార్టీ మాజీ నేత - తెలంగాణ ఇంటి పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ మంద కృష్ణను అరెస్ట్ చేసి జైల్ లో పెట్టడం అమానుషమన్నారు. ఉద్యమకారులపై కేసీఆర్ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏసుక్రీస్తు సీఎం కేసీఆర్ రూపంలో ఉన్నాడని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పడం సిగ్గుచేటని చెరుకు సుధాకర్ అన్నారు. కేసీఆర్ ఏసు రూపంలో లేడని... తన కుటుంబం కోసమే ఉన్న నరరూప రాక్షసుడని ఆయన మండిపడ్డారు.