Begin typing your search above and press return to search.

ఎంతకూ లెక్క తేలదు.. రాజు చేతి మీద ఉన్న మౌనిక ఎవరు?

By:  Tupaki Desk   |   17 Sep 2021 5:30 AM GMT
ఎంతకూ లెక్క తేలదు.. రాజు చేతి మీద ఉన్న మౌనిక ఎవరు?
X
ఆరేళ్ల పాపను కామంతో పొట్టన పెట్టుకున్న కామాంధుడు రాజు కథ ఎట్టకేలకు ముగియటం తెలిసిందే. రైలు పట్టాల మీద భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతూ.. దానికి సంబంధించిన ప్రత్యక్షసాక్ష్యుల కథనాలు ఇప్పటికే టీవీ చానళ్లలో మారుమోగాయి. మరికొందరు ఎన్ కౌంటర్ కాస్తా.. రైల్ కౌంటర్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా.. రాజు ఆత్మహత్య అందరిని ఆనందానికి గురి చేసింది. దీనికి తగ్గట్లే.. అతడి మరణ వార్త తెలిసినంతనే బాణసంచా కాల్చటం..సంబరాలు చేసుకోవటం కనిపించింది. మరోవైపు అతడి డెడ్ బాడీని పోస్టుమార్టం చేసేందుకు తీసుకొచ్చిన సమయంలో.. అతడి శవాన్ని చెప్పులతో కొట్టేందుకు పలువురు ప్రయత్నించటం చూస్తే.. ఈ విషయంలో ప్రజలు ఎంతటి ఆగ్రహంతో రగిలిపోయారన్న విషయం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

హత్యాచారం చేసిన రాజు.. ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతన్ని ప్రాథమికంగా గుర్తించటానికి.. రాజుగా నిర్దారణ చేయటానికి అతడి చేతి మీద ఉన్న ‘మౌనిక’ అనే పచ్చబొట్టే. రైలు ప్రమాదంలో ముఖం పూర్తిగా చితికిపోవటంతో గుర్తు పట్టే పరిస్థితి లేదు. దీంతో.. చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఆధారంగా అతన్ని నిందితుడు రాజు అని ప్రాథమికంగా నిర్దారించి.. అనంతరం అతని కుటుంబీకులు కూడా గుర్తించినట్లుగా చెబుతున్నారు.

మరి.. ఈ కామాంధుడి చేతి మీద ఉన్న ‘మౌనిక’ ఎవరు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించని పరిస్థితి. తొలి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాజు ఇటీవల భార్యతో విభేదాలు రావటంతో ఆమె సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్ పురంలోని పట్టింట్లో ఉన్నట్లుగా సమాచారం.

మరోవైపు రాజు తన మేనమామ కుమార్తెను ప్రేమ వివాహంగా చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇదేమీ కాదని జలాల్ పురంలో ఉంటున్న యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని.. ఆమె పేరును మౌనికగా మార్చినట్లుగా మరికొందరు చెబుతుంటే.. ఇదేమీ కాదని.. అతడి మేనకోడలి పేరు మౌనిక అని చెబుతున్నారు. మొత్తంగా చూసినప్పుడు ఏ మౌనిక పేరుతో ఉన్న పచ్చబొట్టుతో నరరూప రాక్షసుడు రాజును గుర్తించారో.. ఆ పేరు వెనుక అసలు కథేమిటన్న దానిపై క్లారిటీ రాని పరిస్థితి.