Begin typing your search above and press return to search.

కరోనాను ఖతం చేసే ‘మౌత్ స్ప్రే’

By:  Tupaki Desk   |   21 July 2020 6:45 AM GMT
కరోనాను ఖతం చేసే ‘మౌత్ స్ప్రే’
X
ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనాకు మందు లేక.. వ్యాక్సిన్ ఇప్పట్లో రాక జనాలు చచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే రోజుకొక మందు మార్కెట్లోకి వస్తోంది. తాజాగా ‘మౌత్ స్ప్రే’ ఒకటి శక్తివంతంగా పనిచేస్తుండడం ఊరట కలిగిస్తోంది.

స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ ‘ఎంజైమాటికా’ తాజాగా మౌత్ స్ప్ర్రే ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే కరోనా వైరస్ ను నిరోధించవచ్చని ప్రకటించింది. కరోనాను క్రియారహితం చేస్తోందని ప్రాథమిక ఫలితాల్లో తేలిందని కంపెనీ సోమవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.

ఈ మౌత్ స్ప్రేకు ‘కోల్డ్ జైమ్’గా పేరు పెట్టారు. ఇది 20 నిమిషాల్లోనే 98.3శాతం కరోనా వైరస్ ను నాశనం చేస్తుందని కంపెనీ ఎంజైమాటికా తెలిపింది.కరోనా జాతికి చెందిన అన్ని రకాల వైరస్ లను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్టు ఫలితాలు సూచించాయని కంపెనీ తెలిపింది. నోటీ ద్వారా వ్యాపించే వైరస్ లను ఇది అడ్డుకుంటుందని ప్రకటించింది.

అమెరికాకు చెందిన మైక్రోబాక్ లాబోరేటరీస్ ద్వారా ఈ అధ్యయనం నిర్వహించారు. గ్లిసరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్పన్లతో కూడిన సొల్యూషన్ తో నిండిన కోల్డ్ జైమ్ ను ఉపయోగించి వైరసిడల్ ఎఫికసీ పరీక్ష చేసినట్టు కంపెనీ తెలిపింది.

ఈ కోల్డ్ జైమ్ మౌత్ స్ర్పే నోరు.. గొంతు లోపలికి స్ర్పే చేస్తే ఇన్ ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని వల్ల వైరస్ వ్యాప్తిని కూడా బాగా తగ్గిస్తుందని తేలింది.