Begin typing your search above and press return to search.

సినిమా డైలాగులు ఓట్లు రాలుస్తాయా... ప‌వ‌న్ పాలిటిక్స్ ఏంటి...?

By:  Tupaki Desk   |   6 Nov 2019 3:52 AM GMT
సినిమా డైలాగులు ఓట్లు రాలుస్తాయా... ప‌వ‌న్ పాలిటిక్స్ ఏంటి...?
X
రాజ‌కీయాల‌కు సినిమా డైలాగులు స‌రిపోతాయా? ఓట్లు రాలుస్తాయా? ఏమో..ఒక‌ప్ప‌టి మాటేమో కానీ.. ఇప్పుడున్న త‌రంలో అయితే.. రాజ‌కీయాల్లో సినిమా డైలాగులు వినేందుకు ఎంజాయ్ చేసేందుకు మాత్ర‌మే స‌రిపోతాయ‌ని ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా తెలిసిపోయింది. ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తాను ఊగిపోతూ.. మైకును ఊపేస్తూ.. వెల్లువ‌లా వ‌దిలిన డైలాగు ల‌కు పెద్ద‌గా ఓట్లు రాల‌లేదు. దీంతో ఏకంగా ఆయ‌నే ఓడిపోయాడు. ఇక వంగి వంగి ద‌ణ్ణాలు పెట్టిన చంద్ర‌బాబుకు కూడా ప్ర‌జ‌లు ఫిదా కాలేదు. ఇక సినిమా స్టార్‌గా ఉండి పాలిటిక్స్ లోకి వ‌చ్చిన ప‌వ‌న్ సినీ డైలాగులకు ప్ర‌జ‌లు ప‌డిపోలేదు. అయినా కూడా ప‌వ‌న్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ని అంటున్నారు జ‌నాలు.

గ‌డిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. తన‌దైన సినిమా డైలాగుల‌తో ప్ర‌భుత్వంపైనా, జ‌గ‌న్‌ పైనా విరుచుకు పడుతున్నారు. అదే స‌మ‌యంలో సినిమా డైలాగుల‌ను ప్ర‌యోగిస్తున్నారు. స‌టైర్లు పేలుస్తున్నాడు. అయితే, వీటి వ‌ల్ల ఆయ‌న పెంచుకునే అభిమానం ఎక్క‌డా వీస‌మెత్తు కూడా పెర‌గ‌క‌ పోవ‌డం గ‌మ‌నార్హం. నిజానికి సినిమా డైలాగుల‌ను యువ‌త ఆక‌ర్షించ‌గ ల‌వేమో కానీ.. ఓటు బ్యాంకుగా ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్ని మాత్రం ఆక‌ర్షించ‌లేక పోతున్నాయి.

నిజానికి యువ‌త ఓట్లు త‌న‌కు వేయడం లేద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ త్వ‌ర‌గా గ్ర‌హించాల్సిన నిజం. కానీ, వారినే టార్గెట్ చేసుకుని ప‌వ‌న్ చేస్తున్న సినిమా రాజ‌కీయాలు మాత్రం ఎబ్బెట్టుగా మారాయి. పైగా ఇటీవల ఎన్నిక‌ల్లో ఆయ‌న చ‌వి చూసిన ఓట‌మిని చాలా లైట్‌ గా తీసుకుంటున్న‌ట్టు కూడా క‌నిపిస్తున్నారు.
పైగా ఇటీవ‌ల విశాఖ లాంగ్ మార్చ్ కానీ, త‌ర్వాత చేప‌ట్టిన జిల్లాల ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోకానీ, కార్య‌క‌ర్త‌ల‌తో జ‌రిగిన స‌మావేశాల్లో కానీ ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు రాజ‌కీయంగా త‌న‌ను తానే చుల‌క‌న చేసుకుంటున్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రాజ‌కీయాలు వేరు.. వ్య‌క్తిగ‌తాలు వేరు.. అయినా కూడా ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌ను ముఖ్యంగా జ‌గ‌న్‌ను ఆయ‌న టార్గెట్ చేస్తు న్న తీరును విమ‌ర్శ‌కులు సైతం త‌ప్పుప‌డుతున్నారు.ప్ర‌ధానంగా జ‌గ‌న్ జైలు జీవితంపై పంచులు పేలుతున్నాయ‌ని ప‌వ‌న్ భావిస్తున్నా.. ఎన్నిక‌ల్లో ఈ త‌ర‌హా పంచుల‌కు ప్ర‌జ‌లు ఓట్లేయ‌ లేద‌నే విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని సూచిస్తున్నారు. మాట మాట్లాడితే అంబ‌టి రాంబాబు కుమార్తె పెళ్లికి వెళ్లాన‌నో లేదా క‌న్న‌బాబుకు త‌న అన్న నాగ‌బాబు లైఫ్ ఇచ్చాన‌నో ఇలా పాత విష‌యాలు మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో మ‌రీ చుల‌క‌న అవుతున్నాడు. ఏదైనా.. కూడా ఓట‌మి నుంచి నేర్చుకున్న పాఠాలు ఎక్క‌డా ప‌వ‌న్‌ లో క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి ఏ విధంగా తాను త‌న పార్టీ ముందుకు వెళ్తాయో చూడాలి.