Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రి వేళ‌.. థియేట‌ర్ నుంచి ప‌రుగులు తీశారు

By:  Tupaki Desk   |   6 Aug 2018 5:22 AM GMT
అర్థ‌రాత్రి వేళ‌.. థియేట‌ర్ నుంచి ప‌రుగులు తీశారు
X
వీకెండ్ వ‌స్తే.. స‌ర‌దాగా సినిమాకు వెళ్ల‌టం చాలామందే చేశారు. ప్ర‌తి వీకెండ్ వేళ‌.. కోట్లాది మంది సినిమాలు చూస్తూ సేద తీరే వారు దేశంలో చాలామందే క‌నిపిస్తారు. తాజాగా కోల్ క‌తాలో ఇలాంటి అనుభూతి కోసం వెళ్లిన ప్రేక్ష‌కుల‌కు చుక్క‌లు క‌నిపించాయి. ప్రాణ‌భ‌యంతో ప‌రుగులు తీయాల్సి వ‌చ్చింది.

అయితే.. సుర‌క్షితంగా సేవ్ కావ‌టం ఈ ఎపిసోడ్ లో ఆనందించ‌ద‌గ్గ అంశం. ఇంత‌కూ ఏం జ‌రిగిందంటే.. న‌టుడు.. క‌మ్ ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్ అయిన అరిజిత్ ద‌త్తా అనే పెద్ద మ‌నిషి బెంగాలీ ఇండ‌స్ట్రీలో సుప‌రిచితుడు. అత‌డికి కోల్ క‌తాలో ఒక థియేట‌ర్ ఉంది. దాని పేరు ప్రియా థియేట‌ర్‌. ఆదివారం అర్థ‌రాత్రి సెకండ్ షో చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు సీరియ‌స్ గా సినిమా చూస్తున్న వేళ‌.. థియేట‌ర్ లో నుంచి పొగ‌లు రావ‌టాన్ని గుర్తించారు.

దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ప్రొజెక్ట‌ర్ రూమ్ టెక్నీషియ‌న్ అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇవ్వ‌టంతో ఐదు ఫైర్ ఇంజిన్ల‌ను తెప్పించి మంట‌ల్ని అదుపులోకి తెచ్చారు. మ‌రోవైపు.. థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన పొగ‌ల‌తో ప్రాణ భ‌యానికి గురైన ప్రేక్ష‌కులు.. మెట్ల మార్గం ద్వారా బ‌య‌ట‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో థియేట‌ర్ యాజ‌మాన్యం సైతం ప్రేక్ష‌కుల విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిన‌ట్లు చెబుతున్నారు.

మొత్తంగా.. ఏ ప్రేక్ష‌కుడికి ఎలాంటి ప్రాణ‌హాని క‌లుగ‌కుండా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 1959 నుంచి న‌డుస్తున్న ఈ థియేట‌ర్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో చెల‌రేగిన మంట‌లు పై అంత‌స్తులో ఉన్న సినిమా హాల్ లోకి వ్యాపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టంతో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది.