Begin typing your search above and press return to search.
పోలీసులతోనే వాగ్వాదం.. ముంబైలో హీరోయిన్ /ఎంపీ అరెస్ట్..
By: Tupaki Desk | 23 April 2022 4:05 PM GMTప్రముఖ నటి, ఎంపీ కూడా అయిన నవనీత్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. ఆమె భర్త రవి తో కలిసి తాజాగా హనుమాన్ చాలీసా చాలెంజ్ విసిరి ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యారు. వీళ్లకు కౌంటర్ గా శివసేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హైటెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే. వీళ్లకు కౌంటర్ గా శివసేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హైటెన్షన్ నెలకొంది.
ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు ప్రయత్నించగా.. ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఐపీసీ సెక్షన్ 153ఏ ప్రకారం నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం. పోలీసుల చర్యపై నవనీత్ కౌర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తామేమీ ఉగ్రవాద చర్యలకు పాల్పడడం లేదని.. సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని మాత్రమే చెబుతున్నామంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఇక ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతోపాటు మంత్రి అనిల్ పరబ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
నవనీత్ కౌర్ ప్రకటనతో ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రానా , ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.