Begin typing your search above and press return to search.
మంత్రి ఇంటిపై ఐటీ దాడులు..పార్లమెంటులో రచ్చ
By: Tupaki Desk | 2 Aug 2017 7:15 AM GMTదేశవ్యాప్తంగా జరుగుతున్న ఐటీ దాడులు ఈరోజు పార్లమెంట్ సమావేశాలను కుదిపేశాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం బెంగుళూర్‌లోని ఓ రిసార్ట్ లో ఉన్నారు. ఈ రిసార్ట్ కర్నాటక మంత్రి శివకుమార్ చెందినది సమాచారం. దీంతో అనూహ్య రీతిలో మంత్రి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు జరిపినట్లు సమాచారం. మంత్రి ఇళ్లలో జరిగిన ఐటీ దాడుల్లో అయిదు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మంత్రి శివకుమార్ కు చెందిన ఢిల్లీ నివాసం నుంచి ఆ మొత్తాన్ని ఐటీ పట్టుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మంత్రికి చెందిన సుమారు 39 ప్రాంతాల్లో ఈ సోదాలు సాగుతున్నాయి. మొత్తం 120 సభ్యుల ఐటీ బృందం ఈ దాడుల్లో పాల్గొంది. ఈ సోదాల సమయంలో సీఆర్ పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారని సమాచారం. కాగా, కర్నాటక మంత్రి శివకుమార్ ఇళ్లపై ఐటీశాఖ దాడులు చేయడం పట్ల రాజ్యసభలో రగడ జరిగింది. మంత్రి ఇంట్లో సోదాలు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అహ్మద్ పటేల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం నిర్ధాక్షిణ్యంగా వాడుకుంటున్నదని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ఆరోపించారు. గుజరాత్ ఎమ్మెల్యేలను తన రిసార్ట్ లో పెట్టుకున్నందుకే కర్నాటక మంత్రి, అతని సోదరుడి ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని ఆనంద్ శర్మ ఆరోపించారు. బీజేపీ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు కొందరికి 15 కోట్లు ఇస్తున్నదని, వాళ్ల ఇండ్లపై దాడులు చేయించాలంటూ గులామ్ నబీ ఆజాద్ ఆరోపించారు.
ఈ అంశంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. బెంగుళూరుకు చెందిన లగ్జరీ రిసార్ట్ లో ఎటువంటి ఐటీ దాడులు జరగలేదన్నారు. ఎమ్మెల్యేలను సోదా చేయలేదన్నారు. కేవలం కర్నాటక మంత్రి ఇంట్లో మాత్రమే సోదాలు నిర్వహించినట్లు జైట్లీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ విపక్షాలు సభలో ఆందోళన కొనసాగించాయి. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను వాయిదా వేశారు.