Begin typing your search above and press return to search.

క‌శ్మీర్‌లో సైనికులు చ‌నిపోతుంటే..పాక్ తో టీ20 మ్యాచ్ ఆడాలా ?

By:  Tupaki Desk   |   19 Oct 2021 1:30 PM GMT
క‌శ్మీర్‌లో సైనికులు చ‌నిపోతుంటే..పాక్ తో టీ20 మ్యాచ్ ఆడాలా ?
X
మోదీ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఎంఐఎం నేత, ఎంపీ అస‌దుద్దీన్ ఫైర్ అయ్యారు. రెండు అంశాల‌పై ప్ర‌ధాని మోదీ ఎప్పుడూ మాట్లాడ‌డం లేద‌న్నారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయ‌ని, దీనిపై ప్ర‌ధాని మోదీ నోరెత్త‌డంలేద‌ని అస‌దుద్దీన్ ఆరోపించారు. ఇక స‌రిహ‌ద్దుల్లో చైనా కూడా మ‌న భూభాగంలోకి ప్ర‌వేశిస్తోంద‌ని, దాని గురించి కూడా మోదీ స‌ర్కార్ ఏమీ చేయ‌లేక‌పోతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.

హాట్‌ స్ప్రింగ్స్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో చైనా సైనికులు దూసుకువస్తున్నార‌ని, కానీ వారిని మోదీ ప్ర‌భుత్వం అడ్డుకోలేక‌పోయింద‌న్నారు.

జ‌మ్మూక‌శ్మీర్‌ లో ఉగ్ర‌వాదాన్ని అణిచివేస్తామ‌న్న మోదీ, దాంట్లో విఫ‌ల‌మైన‌ట్లు అస‌ద్ పేర్కొన్నారు. క‌శ్మీర్‌ లో తాజాగా జ‌రిగిన ఉగ్ర‌వాద దాడుల్లో 9 మంది భార‌త జ‌వాన్లు మ‌ర‌ణించార‌ని, ఒక‌వైపు సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మ‌రో వైపు టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ లో ఇండియా ఎలా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతుంద‌ని అస‌ద్ ప్ర‌శ్నించారు.

టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ లో భాగంగా ఈనెల 24వ తేదీ ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. చైనాను ఎదుర్కోవ‌డంలో.. క‌శ్మీర్‌ లో ఉగ్ర‌వాదాన్ని అణిచివేయ‌డంలో మోదీ విఫ‌ల‌మైన‌ట్లు అస‌ద్ ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఆ రెండు విషయాల గురించి నోరుమెదపడం లేదని, దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, లడఖ్ లోని భారత భూభాగాన్ని చైనా అక్రమించిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ నిప్పులు చెరిగారు. కశ్మీర్‌ లో మన భారత సైనికులు ఉగ్రవాదుల చేతిలో చనిపోతుంటే.. పాకిస్థాన్‌ తో ఈ నెల 24న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ ఆడడం అవసరమా అని ప్రశ్నించారు. అంతేకాకుండా కశ్మీర్‌ పౌరుల ప్రాణాలతో పాకిస్థాన్ ఉగ్రవాదులు 20-20 అడుతున్నారని, ఇప్పటికే బీహర్‌ కు చెందిన కూలీలు 11 మంది ప్రాణాలు బలిగొన్నారన్నారు. ఇవన్నీ చూస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనం పాటిస్తున్నారన్నారు.