Begin typing your search above and press return to search.
రఘురామ పై మళ్లీ స్పీకర్ కు ఫిర్యాదు
By: Tupaki Desk | 13 July 2021 2:30 PM GMTరెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని వైసీపీ వదిలిపెట్టడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనపై అనర్హత వేటు వేయాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే లోక్ సభ స్పీకర్ ను మరోసారి కలిసింది వైసీపీ.. ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్ ను స్పీకర్ కు అందజేశామని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. స్పీకర్ కు ఉన్న విచక్షణ అధికారాలతో వేటు వేస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ 'రఘురామ కృష్ణంరాజు వైసీపీ అధినేత, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారని' విమర్శించారు. ఆయన పాల్పడుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. గతంలో జరిగిన శరద్ యాదవ్ ఘటన కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
ఇప్పటికే వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. స్పీకర్ రఘురామపై అనర్హత వేటువేయాలని చాలా సార్లు స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ మాత్రం ప్రతీసారి దీనిపై సానుకూలంగా స్పందించకపోవడంతో వైసీపీ ఎంపీలు తాజాగా మరోసారి ఫిర్యాదు చేశారు.. వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవలే ఓ లేఖ కూడా రాశారు. తాజాగా నేరుగా వైసీపీ ఎంపీలు స్పీకర్ ను మరోసారి కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామరాజు పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను స్పీకర్ కు అందజేశారు. వెంటనే రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు. వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రఘురామపై ఫిర్యాదు చేశామని చెప్పారు. గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్ కు మరోసారి అందించామని తెలిపారు. రఘురామ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోసారి కోరామని చెప్పారు. దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని.. రఘురామపై వేటు వేస్తారంటూ మాట్లాడారు.
స్పీకర్ మాత్రం ఇప్పటికీ ఎంపీ రఘురామపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఏడాది క్రితం నుంచి ఆయనపై అనర్హత వేటు పరిశీలన జరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి రఘురామపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా స్పీకర్ నుంచి సరైన స్పందన రావడం లేదు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నా ఆయన కరగడం లేదు. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తే రఘురామపై వేటు ఆలస్యం అయ్యేలానే కనిపిస్తోంది.