Begin typing your search above and press return to search.
బైక్ కు రూ.1.13లక్షల ఫైన్.. ఎందుకు వేశారంటే?
By: Tupaki Desk | 15 Jan 2021 1:30 AM GMTచిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ఎప్పుడైతే చట్టాన్ని అమలు చేస్తారో అప్పుడు మాత్రమే తప్పు చేయాలన్న ఆలోచన రాదు. పేదవాడు కాబట్టి ఫలానా తప్పునకు పెద్ద శిక్ష వేయొద్దు.. సంపన్నుడు.. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి కాబట్టి.. తప్పుల్ని లైట్ తీసుకోవాలనటం తప్పే అవుతుంది. అంతేకాదు.. ఈ తరహా వాదనను వినిపించే వారిని పైతం తప్పులు చేసినట్లుగా భావించి శిక్షలు వేస్తే కానీ అందరూ జాగ్రత్తగా ఉండటమే కాదు.. ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తారు. రాజ్యాంగంలో చెప్పినట్లుగా చట్టం ముందు అందరూ సమానులే అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఇంతకూ ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు అంటారా? అక్కడికే వస్తున్నాం.
ఒడిశా పోలీసులు ఒక బైక్ కు వేసిన జరిమానానే కొత్త చర్చకు కారణం. నిబంధనల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న సదరు బైక్ యజమానికి ఏకంగా రూ.1.13లక్షల ఫైన్ వేయటం విస్మయానికి గురి చేయొచ్చు కానీ.. అతగాడు చేసిన తప్పులతో చూసినప్పుడు అదేమీ తప్పుగా అనిపించదు. ఇంతకూ అతనేం చేశాడంటే.. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జంక్షన్ వద్ద పోలీసులు.. ఆర్టీవో సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అదే మార్గంలో ప్లాస్టిక్ డ్రమ్ములు బైకు చుట్టూ కట్టుకొని అమ్మే వ్యక్తిని ఆపారు. అతను మధ్యప్రదేశ్ కు చెందిన ప్రకాశ్. అతని బైక్ చుట్టూ 8 డ్రమ్ములు కట్టుకొని ఉన్నాడు. భారీగా లోడ్ వేసుకొని రోడ్డుకు అడ్డదిడ్డంగా వెళుతున్న అతన్ని ఆపి.. డాక్యుమెంట్ అడిగితే లేదన్న సమాధానం. కనీసం.. రిజిస్ట్రేషన్ అడిగితే.. అది కూడా లేదనటంతో పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఆన్ లైన్ లో చెక్ చేయగా.. అవాక్కు అయ్యే పరిస్థితి. ఎందుకంటే.. సదరు వెహికిల్ కు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదన్న విషయం తాజా తనిఖీల్లో తేలింది. దీంతో.. ఆ బైక్ వ్యక్తికి అన్ని తప్పులకు కలిపి రూ.1.13లక్షల భారీ మొత్తాన్ని ఫైన్ వేశారు. ఒక చిరు వ్యాపారికి అంత భారీ ఫైన్ వేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవన్న సందేశాన్ని ఇచ్చినట్లైంది. అయితే.. ఇదే తీరును మరింత పెద్ద ఎత్తున చేపడితే బాగుంటుంది. ఇక.. భారీ మొత్తాన్ని ఫైన్ గా పడిన ప్రకాశ్ విషయాతనికి వస్తే.. స్నేహితులకు ఫోన్లు చేసి.. అందరి నుంచి సమీకరించి చెల్లింపులు జరిపాడు. తప్పులు చేసినోళ్లు ఎవరైనా సరే.. శిక్ష తప్పదన్న సందేశాన్ని ఇచ్చినట్లైందని చెప్పాలి.