Begin typing your search above and press return to search.
ఈసీకి ఎంపీ అభ్యర్థి బెదిరింపు లేఖ
By: Tupaki Desk | 16 April 2019 8:29 AM GMTకిశోర్ సమ్మిట్.. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఈయన ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లోక్ సభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అయితే తనకు సమాజ్ వాదీ పార్టీ టికెట్ ఇవ్వలేదని.. తన వద్ద డబ్బులు లేవని కిశోర్ సమ్మిట్ ఈసీకి లేఖ రాశారు. కిడ్నీలు అమ్ముకొని ప్రచారం చేసుకునేందుకు తాను సిద్ధమని.. డబ్బులన్నీ ఇవ్వండి.. లేదంటే కిడ్నీలు అమ్ముకోవడానికైనా అంగీకరించాలని ఈసీకి లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
తనకు పోటీగా ఉన్న ప్రత్యర్థి పార్టీల ఎంపీ అభ్యర్థులంతా కోటీశ్వరులేనని.. వారితో పోటీ పడి డబ్బు ఖర్చు పెట్టి తాను ప్రచారం చేసుకోలేనని కిశోర్ తెలిపారు. ఎన్నికల ప్రచారానికి 15రోజులు మాత్రమే గడువు ఉందని.. తనకు 75 లక్షల నిధులు ఇవ్వాలని లేఖలో కోరారు. బ్యాంకుల నుంచైనా రుణం ఇప్పించాలని.. లేకుంటే కిడ్నీలు విక్రయించుకునేందుకు అనుమతించాలని కోరారు.
తాను రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు కిశోర్ సమ్మిట్. డబ్బులు ఉన్నవారే పోటీలో ఉన్నారని.. ఈసీ నియమాలు కూడా అలాగే ఉన్నాయని కిశోర్ వాపోయారు. ప్రస్తుత నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశారు. డబ్బు ఖర్చు పెట్టేందుకు అనుమతి ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ చట్టాల ప్రకారం సామాన్యులు పోటీచేసే అవకాశం లేదని వాపోయారు.