Begin typing your search above and press return to search.

కేటీఆర్ జన్మలో సీఎం కాలేరు.. కేసీఆర్ కు ఆ భయం పట్టుకుంది : ఎంపీ

By:  Tupaki Desk   |   27 Jun 2021 10:56 AM GMT
కేటీఆర్ జన్మలో సీఎం కాలేరు.. కేసీఆర్ కు ఆ భయం పట్టుకుంది : ఎంపీ
X
తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కాకరేపుతోంది. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ మంత్రులు, కీలక నేతలు మోహరించారు. ఇక బీజేపీ సైతం ఎమ్మెల్యేలు, ఎంపీలను రంగంలోకి దించింది. దీంతో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు.. ఎన్నికకు ఐదు నెలలున్నా కూడా ఇప్పుడే హుజూరాబాద్ ను రెఫరెండంగా ఇరు పార్టీలు భావిస్తున్నాయి.

హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేటీఆర్ తోపాటు మంత్రి కేటీఆర్ లపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. ‘సీఎంకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ ను హుజూరాబాద్ లో పోటీకి దింపాలని సవాల్ చేశారు. మంత్రి కేటీఆర్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేకమేడలా కూలిపోతుందని ఎంపీ జోస్యం చెప్పారు.

‘భైంసా పట్టణంలో ఒక్క హిందువూ ఉంచడం లేదు. కేటీఆర్ దిక్కుమాలిన కోరిక తీర్చేందుకు ఈటల రాజేందర్ పై కుట్ర చేశారు. కేసీఆర్ కు సిగ్గు, శరం, దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ ను తీసుకొచ్చి హుజూరాబాద్ లో నిలబెట్టాలి’ అని ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పైసలు తీసుకున్న టీఆర్ఎస్ నాయకులు ఈటలకు టచ్ లో ఉన్నారని.. కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల కోసం 300 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. కర్మకాలి టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే అధికారులు బానిసలు అవుతారని.. దళితులను కేసీఆర్ అవమానించినంతగా ఇంకా ఎవరూ అవమానించలేదని విమర్శించారు.