Begin typing your search above and press return to search.
'కాళీ' పోస్టర్ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన 'దీదీ' ఎంపీ
By: Tupaki Desk | 6 July 2022 3:28 AM GMTఒక ఇష్యూ వివాదంగా మారి.. తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళలో.. ఆ వివాదానికి వీలైనంత దూరంగా ఉండటం.. అందులోని మంచి చెడులను ఎవరూ ఫీల్ కాకుండా చూడటం గతంలో ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం అగ్నికి ఆజ్యం పోసే వ్యాఖ్యలతో వివాదాస్పద అంశాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కొందరు రాజకీయ నేతలు. తాజాగా అలాంటి పనే చేశారు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఒకరు.
ఇటీవల కాళికా అమ్మవారి వేషంలో ఉన్న పాత్రధారి సిగిరెట్ తాగుతున్న పోస్టర్ ను విడుదల చేయటం.. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం తెలిసిందే. దీనిపై చిత్ర దర్శకురాలు లీనా మణిమేకలై సైతం స్పందిస్తూ.. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలని చెబుతున్నారు.
దీనిపైనా పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వివాదంలోకి తాజాగా ఎంట్రీ ఇచ్చారు టీఎంసీ (త్రణమూల్ కాంగ్రెస్) లోక్ సభ సభ్యురాలు మహువా మోయిత్రా.
కాళీమాత మధుమాంస భక్షిణి అంటూ ఆమె నోరు పారేసుకున్నారు. కాళీ మాత మధుమాంసాలను స్వీకరించే దేవత గానే తనకు తెలుసున్న వ్యాఖ్యపై పలువురు మండిపడుతున్నారు. తాజాగా ఆమె ఇండియా టుడే కాన్ క్లేవ్ 2022లో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాళీ పోస్టర్ మీద స్పందించిన మహువా.. కాళీమాత సిగిరెట్ తాగుతుందో లేదో తెలియదని చెబుతూనే.. ఆమె మధుమాంస భక్షిని వ్యాఖ్యానించారు.
టీఎంపీ ఎంపీ వ్యాఖ్యలపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. సంఘ్ పరివార్ కు తాను ఒక్కటే చెబుతానని.. అబద్ధాలతో ఉత్తమ హిందువులుగా మారలేమన్నారు. తాను ఏ పోస్టర్ కు మద్దతు ఇవ్వలేదని.. తారాపీఠ్ లోని కాళీ మందిర్ కు వెళ్లాలని.. అమ్మవారికి అక్కడ ఆహారంగా.. పానీయాలుగా ఏమేం ఇస్తారో చూడాలంటున్నారు.
చూస్తుంటే.. ఒక వివాదంతో సతమతమవుతున్న వేళ.. మరో వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ఈ టీఎంసీ మహిళా ఎంపీ వ్యాఖ్యలపై పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులు అంటే ఒక్క సంఘ్ పరివార్ మాత్రమే కాదని.. ఆ సంస్థతో సంబంధం లేని కోట్లాది మంది కూడా ఉంటారన్న విషయాన్ని టీఎంసీ మహిళా ఎంపీ త్వరగా తెలుసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.