Begin typing your search above and press return to search.

ఎంపీ గ‌ల్లా ఎఫెక్ట్ టీడీపీపై బాగానే పడిందే...!

By:  Tupaki Desk   |   13 Dec 2021 4:49 AM GMT
ఎంపీ గ‌ల్లా ఎఫెక్ట్ టీడీపీపై బాగానే పడిందే...!
X
టీడీపీలో చాలా మంది నాయ‌కులు చేత‌నంగా లేర‌ని.. పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు ఒక‌వైపు పోరు పెడుతూనే ఉన్నారు. అయిన‌ప్ప టికీ.. నాయ‌కులు ఉత్సాహం చూపించ‌డం లేదు. ఆ.. ఎన్నిక‌లు వ‌చ్చాక చూసుకుందాంలే.. అనే ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వీరి ప‌రిస్థితి ఇలా ఉంటే.. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన నాయ‌కులుకూడా పార్టీలో ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉంటున్నారు. ఇప్ప‌టికే గంటా శ్రీనివాస‌రావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎంపీ కేశినేని నాని.. అప్పుడ‌ప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఇక‌, గుంటూరుఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ తొలి రెండేళ్లు బాగానే స్పందించారు.

ముఖ్యంగా రాజ‌ధాని ఉద్య‌మంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. రాజ‌ధాని రైతులు అసెంబ్లీ ముట్ట‌డికి పిలుపునిచ్చిన‌ప్పుడు అంతా తానై వ్య‌వ‌హ‌రించారు. అరెస్టు కూడా అయ్యారు. రాజ‌ధాని ఉద్య‌మానికి ఎన్నారైల నుంచి కూడా విరాళాలు సేక‌రించారు.

ఇక‌, తతాను కూడా ఉద్య‌మంలో పాల్గొన్నారు. అనేక సంద‌ర్భాల్లో రైతుల‌కు అండగా ఉన్నారు. ఉద్య‌మాన్ని ఢిల్లీ వ‌ర‌కు తీసుకువెళ్లారు. రైతుల‌ను త‌న సొంత ఖ‌ర్చుతో ఢిల్లీకి తీసుకువెళ్లి.. అక్క‌డ జాతీయ నేత‌ల‌తోనూ ప‌రిచ‌యం చేశారు.

ఇలా.. అనేక రూపాల్లో క‌నిపించి, పార్టీ వాయిస్ వినిపించిన‌.. గ‌ల్లా జ‌య‌దేవ్‌.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. గ‌త ఆరు మాసాలుగా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న మాట వినిపించ‌డంలేదు, ఆయ‌న ఫొటో కూడా క‌నిపించ‌డం లేదు.

దీంతో అస‌లు ఏం జ‌రిగింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ విష‌యంపైనే చంద్ర‌బాబు స‌హా.. సీనియ‌ర్లు కూడా దృష్టి పెట్టారు. గ‌తంలో జ‌య‌దేవ్‌.. కు చెందిన అమ‌ర‌రాజా ఫ్యాక్ట‌రీపై పొల్యూష‌న్ ఆరోప‌ణ‌లు రావ‌డం.. రాష్ట్ర ప్రభుత్వం మూసివేత చ‌ర్య‌లు తీసుకోవ‌డం.. ఈ క్ర‌మంలో హైకోర్టుకు వెళ్లినా.. ఫ్యాక్ట‌రీకి వ్య‌తిరేకంగానే తీర్పు రావ‌డం తెలిసిందే.

ఆ త‌ర్వాత‌.. ప్ర‌భుత్వానికి-గ‌ల్లా కుటుంబానికి మ‌ధ్య మ‌ధ్య వ‌ర్తిత్వం జ‌రిగింద‌ని.. దీంతో అప్ప‌టి నుంచి ప్ర‌భుత్వం కొంత వెన‌క్కి త‌గ్గ‌డం తెలిసిందే.

ఇక‌, అప్ప‌టి వ‌ర‌కు గ‌ల్లా దూకుడుగా ఉన్న‌ప్ప‌టికీ ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌.. ఆయ‌న పూర్తిగా సైలెంట్ అయ్యారు. సో.. గ‌ల్లా.. సైలెంట్ వెనుక‌.. ప‌రిశ్ర‌మ‌పై ఒత్తిళ్లే ప‌నిచేస్తున్నాయ‌నే వాద‌న టీడీపీ స‌ర్కిళ్ల‌లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి .. ఇదే నిజ‌మైతే.. మున్ముందు.. పార్టీకి మ‌రింత క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.