Begin typing your search above and press return to search.

ఎక్కువ మాట్లాడితే.. ప్రెస్ మీట్ పెట్టి వంద రక్తచరిత్రలు చెబుతా

By:  Tupaki Desk   |   12 Dec 2020 10:21 AM IST
ఎక్కువ మాట్లాడితే.. ప్రెస్ మీట్ పెట్టి వంద రక్తచరిత్రలు చెబుతా
X
గడిచిన కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న అనంతపురం రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. పరిటాల మరణం తర్వాత.. జిల్లాకు చెందిన నేతల మధ్య ఎవరి పని వారు అన్నట్లుగా ఉన్న దగ్గర నుంచి.. తాజాగా నువ్వా నేనా? అన్న వరకు వెళుతున్న వైనం సంచలనాలకు తెర తీస్తోంది. పరిటాల శ్రీరాం వర్సెస్ హిందూపురం ఎంపీ మాధవ్ మధ్య మాటల తూటాలు భారీగా పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.

ఇటీవల పరిటాల రవి గురించి అనంతపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా పరిటాల శ్రీరాం స్పందిస్తూ.. ‘‘మేం గల్లీ ఫ్యాక్షన్ చేస్తే.. నువ్వు ఢిల్లీ స్థాయిలో రేపిస్ట్ అయ్యావు’’అని మండిపడ్డారు. తన తండ్రి గురించి మాట్లాడే ముందు.. ఎంపీ తనపై ఉన్న రేప్ కేసుల గురించి మాట్లాడాలంటూ కౌంటర్ ఇచ్చారు. దీనికి స్పందించిన ఎంపీ గోరంట్ల మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు.

తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన ఆయన..పరిటాల శ్రీరాం చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టారు. అతడు ఆరోపించినట్లుగా దేశంలో తనపై ఎక్కడ ఏ కేసు ఉందో చూపించాలంటూ సవాలు విసిరారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే.. ప్రెస్ మీట్ పెట్టి వంద రక్తచరిత్రలను చెబుతానని మండిపడ్డారు. ఈ మాటల యుద్ధం రానున్న రోజుల్లో హిందూపురం ఎంపీ నియోజకవర్గంలో కొత్త కాకను పుట్టిస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది.