Begin typing your search above and press return to search.
లోక్ సభ సాక్షిగా అమిత్ షా గాలి తీసేసిన మహిళా ఎంపీ!
By: Tupaki Desk | 19 July 2019 7:14 AM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రత్యర్థి పార్టీలేవి ఉండకుండా చేసే ప్రమాదకర రాజకీయం వేగంగా అమల్లో పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ పార్టీలు - జాతీయ పార్టీలనే తేడా లేకుండా ఫిరాయింపులకు పాల్పడుతోంది. బీజేపీ రథసారథి - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - ఆయన నమ్మినబంటు అమిత్ షా ఈ రాజకీయ ఎత్తుగడల్లో బిజీగా ఉంటున్నారు. అయితే, చట్టసభల వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీపీఎం రాజ్యసభ సభ్యురాలు షాకిచ్చారు. త్రిపుర ఎంపీ జర్నాధాస్ ఆయనకు ఇచ్చిన సమాధానానికి హౌం మంత్రి విస్తుపోక తప్పలేదు. ఫిరాయింపుల గురించి మరెప్పుడూ ప్రస్తావించలేనంత రీతిలో కౌంటర్ వచ్చింది.
త్రిపురలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ - ప్రచార కార్యక్రమంలో లెఫ్ట్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ హింసాత్మక దాడులకు పాల్పడుతున్న విషయంలో కేంద్ర హోం మంత్రికి వినతిపత్రం సమర్పించేందుకు సీపీఎం ఎంపీ జర్నాధాస్ ఆయన అపాయింట్ మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసేందుకు కార్యాలయానికి వెళ్ళారు. 'మీరు ఇంకా సీపీఎంలో ఎందుకు కొనసాగుతున్నారు. మీరు మాతో కలిసి పనిచేయండి.. బీజేపీలో చేరండి' అంటూ ఆయన జర్నాధాస్ ను కోరారు. 'బీజేపీ అధ్యక్షుడితో మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. మీరు హోంశాఖ మంత్రి అయినందునే నేను ఇక్కడకు వచ్చాను. నేను మీకు మరో విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. నేను ఎప్పటికీ సీపీఐ(ఎం) పార్టీలోనే కొనసాగుతాను.. మీరు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరంలేదు' అని అమిత్‌షాకు జర్నాదాస్ ధీటైన సమాధానం ఇచ్చారు. ఆమె సమాధానంతో షాక్ తిన్న షా.. మారు మాట్లాడకుండా వినతిపత్రం స్వీకరించి మౌనంగా ఉండిపోయారని ఎంపీ మీడియాతో ఇష్టాగోష్టిగా తెలిపారు.
త్రిపురలో అధికారం కైవసం చేసుకున్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు బలం లేనప్పటికీ - అధికారాన్ని ప్రయోగించి గెలవాలని చూస్తోందని ఈ సందర్భంగా సీపీఎం ఎంపీ జర్నాధాస్ ఆరోపించారు. సీపీఎం కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసి గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో ఫిర్యాదు చేయాలని వస్తే....ఫిరాయింపుల గురించి మాట్లాడారని మండిపడ్డారు.