Begin typing your search above and press return to search.
బీజేపీ-టీఆర్ ఎస్ ల మధ్య కొత్త యుద్ధం
By: Tupaki Desk | 17 Oct 2015 3:56 AM GMTకేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ, తెలంగాణలో పాలకపక్షమైన టీఆర్ ఎస్ ల మధ్య కొత్త పేచీ మొదలయింది. ఇన్నాళ్లు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోణంలో సాగిన ఈ పోరు ఇపుడు రైతుల వరకు చేరింది. పార్టీ జాతీయ నాయకులు స్పందించేవరకు పరిస్థితి చేరింది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ ను తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా నాగం పత్తి రైతులతో మాటామంతి కలిపారు. అయితే ఒక్కాసారిగా అక్కడ సీన్ రివర్స్ అయి నాగంను పత్తి రైతులు ఘోరావ్ చేశారు. పత్తికి గిట్టుబాటు ధరను కేంద్రమే ప్రకటించాలని, ఆ పని ఎందుకు చేయడం లేదని నాగం జనార్ధన్ రెడ్డిని రైతులు నిలదీశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం తీరును తప్పుపడుతు నాగం వెనుదిరిగి వెళ్లిపోయారు.
అయితే నాగం ఎపిసోడ్ పై టీఆర్ ఎస్ ఎంపీ, ఆ పార్టీ పార్లమెంటరీ నేత జితేందర్ రెడ్డి స్పందించారు. పత్తికి మద్దతు ధర కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్రంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని పాలకపక్షమేనని అన్నారు. పత్తి కొనుగోలు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని తేల్చిచెపుతూ..పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఆంక్షలు సరికాదని అన్నారు. సీసీఐ సీఎండీతో వ్యక్తిగతంగా మాట్లాడి 12-16 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని కోరామని తెలిపారు. రాష్ట్రంలో 2 కోట్ల 50 లక్షల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందని, వీటికిగాను ప్రస్తుతం 84 సీసీఐ కొనుగోలు కేంద్రాలున్నాయని తెలిపారు. మరో 16 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే తమను బాధ్యుల్ని చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.