Begin typing your search above and press return to search.

ఒకే మీటింగ్ లో కవిత.. బ్రాహ్మణి

By:  Tupaki Desk   |   9 Feb 2017 9:52 AM GMT
ఒకే మీటింగ్ లో కవిత.. బ్రాహ్మణి
X
నవ్యాంధ్రలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు భవిష్యత్ లో కీలక స్థానాలకు చేరుతారని ఊహిస్తున్న మహిళా నేతల కలయికకు వేదికవుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు టాప్ లీడర్ల కుటుంబాల నుంచి ప్రస్తుత తరం మహిళలు దీనికి హాజరవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.

మహిళా సాధికారతపై జరుగుతున్న ఈ సదస్సుకు 12 వేల మంది ప్రతినిధులు, దేశ విదేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో మహిళా సాధికారతలో సామాజిక రాజకీయ మార్పులు అనే అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొనబోతున్నారు. మరోవైపు చంద్రబాబు కోడలు.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి రంగం సిద్ధం చేసకుంటూ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్న నారా బ్రాహ్మణి కూడా ఇదే సదస్సుకు వస్తున్నారు.

వీరితో పాటు భాజపా కీలక నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ కూడా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అగ్రనేతల కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురు ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి. ఎంపీగా కవిత నిత్యం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. నారా బ్రాహ్మణి కూడా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కార్యక్రామల్లో యాక్టివ్ గానే ఉన్నారు. అలాగే దీపా వెంకట్ సైతం స్వర్ణభారతి ట్రస్టు పనుల్లో బిజేనే. కానీ.. వీరు ముగ్గురు ఒకే చోట గతంలో కలిసిన సందర్భాలు లేవు.

దీంతో వేర్వేరు పార్టీలకు చెందిన అగ్రనేతల కుటుంబ సభ్యులుగా, యువతరం ప్ర్తతినిధులుగా వీరు ఎలా వ్యవహరిస్తారు.. వీరిలో ఎవరు తమ ప్రసంగాలతో మెప్పిస్తారు అన్న ఆసక్తి అంతటా నెలకొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/