Begin typing your search above and press return to search.
కాపీ కొట్టి పప్పా మీద తోసుడేంటి? కవితమ్మ
By: Tupaki Desk | 21 Aug 2015 4:35 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవిత మాటల చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థుల మీద ఆమె నిప్పులు చెరిగే వైనం చూస్తే.. ఆమెను వ్యతిరేకించే వారు సైతం మనసులో ముచ్చటపడిపోతుంటారు. ఎంత తెలివిగా తన వాదనను వినిపిస్తుందో అని అనుకుంటారు. కాశ్మీర్ లాంటి సున్నితమైన అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించటమే కాదు.. ఇరుక్కుపోకుండా.. తన సత్తాను నలుగురికి తెలిసేలా చేయటంలో ఆమె ఎంత సక్సెస్ అయ్యారన్నది అందరికి తెలిసిందే.
వివాదాస్పద అంశాల్ని ప్రస్తావించిన సమయంలో చేదు అనుభవాలు సహజం. అందుకు భిన్నంగా కవిత మాత్రం చాలా తెలివిగా వ్యవహరించారని చెబుతారు. తాజాగా ఆమె ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఒక ప్రశ్నకు ఆమె మాటల చాతుర్యం ఏమిటో తెలుస్తుంది. తన తండ్రి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వాటర్ గ్రిడ్ పథకం తన బ్రెయిన్ చైల్డ్ అని.. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని.. పప్పా కాపీ కొట్టిండని వ్యాఖ్యానించారు.
కానీ.. అంతలోనే సర్దుకొని.. సదరు స్కీంను పప్పా నుంచి తానే కాపీ కొట్టేశానని మళ్లీ సర్ది చెప్పటం గమనార్హం. అప్పుడెప్పడో.. పాతికేళ్ల కిందట తన తండ్రి సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమలు చేసిన వాటర్ గ్రిడ్ స్కీంను చూసి తాను కాపీ కొట్టి.. సార్వత్రిక ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మంచినీళ్లు అందిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పాతికేళ్ల క్రితం తండ్రి అమలు చేసిన ప్లాన్ ను తన ప్లాన్ గా క్లెయిమ్ చేసుకొని.. వెనక్కి తగ్గిన కవితమ్మ తెలివితేటలు చూస్తే మురిచిపోవాల్సిందే. తండ్రే తనను కాపీ కొట్టారని చెప్పేయటం ఆమెకు మాత్రమే సాధ్యమేమో.
ఒకవేళ ఆమె వ్యాఖ్యలు సరదా అని సరిపెట్టుకోవాలని చూసినా.. కాపీ కొట్టారని చెప్పి.. మళ్లీ సర్దుకొని తానే కాపీ కొట్టినట్లుగా చెప్పుడేంటి? కాపీ కొట్టింది కాకుండా ఈ తోసుడేంటి? తండ్రి విషయంలో ఇలా మాట్లాడుతున్న కవిత.. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మరెంత కరుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.