Begin typing your search above and press return to search.

కేసీఆర్ కుటుంబం..కేంద్రంతో సంబంధాలు..ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   6 Dec 2017 4:57 AM GMT
కేసీఆర్ కుటుంబం..కేంద్రంతో సంబంధాలు..ట్విస్ట్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబ స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న ఒక రకంగా ఆశ్చ‌ర్య‌క‌రంగా - అంతుచిక్క‌ని విధంగా ఉంటుంద‌ని చెప్పుకోవ‌చ్చేమో!ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వంతో సంబంధాల విష‌యంలో ఈ విష‌యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించ‌వ‌చ్చని అంటున్నారు. ఎందుకంటే...ముఖ్య‌మంత్రి కేసీఆర్‌...కేంద్ర ప్ర‌భుత్వంతో ప్ర‌ధానంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో అద్భుత‌మైన సంబంధాలు నెరుపుతుంటారు. అడిగిన‌దానికి - అప్పుడప్పుడు అడ‌గ‌ని దానికి కూడా...మ‌ద్ద‌తు ఇస్తుంటారు. అదే స‌మ‌యంలో రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కేంద్రం త‌న హ‌క్కును వ‌దులుకోవాలని - రాష్ర్టానికి ఆ హ‌క్కులు క‌ట్ట‌బెట్టాల‌ని డిమాండ్ చేస్తుంటారు.

మ‌రోవైపు ఆయ‌న త‌న‌యుడైన‌ మంత్రి కేటీఆర్ ఇందుకు భిన్నం. ఢిల్లీ టూర్‌ లో భాగంగా బిజీ బిజీగా గ‌డిపే మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రుల‌తో క‌లివిడిగా ఉంటారు. వారు సైతం కేటీఆర్‌ ను అదే స్థాయిలో గౌర‌విస్తుంటారు కూడా. కానీ అప్పుడ‌ప్పుడు ఆయ‌న గ‌ల్లీలో కేంద్రం తీరుపై ఘాటుగానే స్పందిస్తుంటారు. ఐటీఐఆర్ - హైకోర్టు - బ‌య్యారంలో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ వంటి విష‌యాల్లో కేటీఆర్ ఘాటుగానే స్పందిస్తుంటారు. త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతుంటారు. ఇలా ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో ప్ర‌వ‌ర్తించే వారి క‌ల్వ‌కుంట్ల వారి జాబితాలో ఎంపీ క‌విత కూడా చేరిన‌ట్లున్నారు. ఎందుకంటే... కేంద్రంపై పెద్ద‌గా స్పందించ‌ని క‌విత తాజాగా ఓ రేంజ్‌ లో విరుచుకుప‌డ్డారు.

త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ప్రగతి భవన్ లో జరిగింది. కేంద్రం ఇస్తున్న నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమీక్షించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన ప‌లు ప‌థకాల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పంటల బీమాపై కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు. పంటల బీమాకు గ్రామాన్ని యూనిట్ గా తీసుకోకుండా రైతును యూనిట్ గా తీసుకుని నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకునే కేంద్రం విధానం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఒక పక్క మహిళా సాధికారత అంటూనే క‌స్తూరిభా గాంధీ విద్యాల‌యాలను ఎత్తివేసిందని విమర్శించారు. ఉపాధిహామీ నిధుల్లో కోత పెట్టారని - ఫలితంగా కూలీలు నష్టపోయారన్నారు. కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయడం లేదని ఎంపీ కవిత అన్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తిస్తుంటే...ఆయ‌న త‌న‌య విమ‌ర్శించ‌డం ఏం ట్విస్ట్ అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.