Begin typing your search above and press return to search.

ఎంపీ కవిత చేసిన పనికి ప్రశంసలు

By:  Tupaki Desk   |   19 March 2019 7:17 AM GMT
ఎంపీ కవిత చేసిన పనికి ప్రశంసలు
X
రోడ్డుపై వెళుతుండగా ఎంపీ కవితకు అనుకోని సంఘటన ఎదురైంది. దానికి అంతే వేగంగా స్పందించి కవిత ప్రశంసలు అందుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించి కవిత తన మానవత్వాన్ని చాటుకున్నారు.

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పరిధిలోని ధర్మారం (బి) గ్రామంలో కాకతీయ స్కూల్ బస్సు ఓ బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై ఉన్న ధర్మారం గ్రామానికి చెందిన మహ్మద్ జిలానీ బస్సు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో జక్రాన్ పల్లి గ్రామానికి వెళుతున్న ఎంపీ కవిత.. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ - ఎమ్మెల్సీలు వీజీ గౌడ్ - ఆకుల లలిత - పార్టీ నాయకులు అక్కడ ఆగారు.

రోడ్డు ప్రమాదం గమనించిన ఎంపీ కవిత తన వాహనం దిగి అంబులెన్స్ కు ఫోన్ చేయడంతోపాటు జిల్లాకేంద్రంలోని ప్రతిభ హాస్పిటల్ వైద్యులకు సమాచారం అందించారు. సమీపంలోనే ఉన్న బాధితుడి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి రోధించగా.. వారిని ఎంపీ కవిత ఓదార్చారు. అంబులెన్స్ రాగానే కుటుంబ సభ్యులతో కలిపి క్షతగాత్రుడిని ఆస్పత్రికి పంపించారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లను ఆదేశించారు. కవిత చేసిన పనికి స్థానికులు ప్రశంసలు కురిపించారు..