Begin typing your search above and press return to search.

కవిత చెప్పిన ‘ఆరడుగుల బుల్లెట్’ ఎవరంటే..

By:  Tupaki Desk   |   23 Sep 2016 6:28 PM GMT
కవిత చెప్పిన ‘ఆరడుగుల బుల్లెట్’ ఎవరంటే..
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. కమ్ మంత్రి అయిన కేటీఆర్ చెయ్యి పట్టుకొని తన వెంట తీసుకెళ్లే సాహసం ఎవరైనా చేస్తారా? చుట్టూ భద్రతాధికారులు.. సిబ్బంది అలాంటి అవకాశమే ఇవ్వరు. కానీ.. గడిచిన కొద్ది రోజులుగా పగ బట్టిన వాన తమ బతుకుల్ని ఆగమాగం చేస్తున్న వేళ.. అధికారుల పని తీరుతో మరిన్ని కష్టాలు మీద పడిన నేపథ్యంలో కడుపులోని కోపాన్ని తన చేతల్లో చూపిందో పెద్ద అవ్వ. హైదరాబాద్ ను అతలాకుతలం చేస్తున్న వర్షాల తీవ్రతను ఆలస్యంగా అర్థం చేసుకున్న మంత్రి కేటీఆర్.. నిన్నటి (గురువారం) నుంచి తిరగటం (వర్షాలు మంగళవారం రాత్రి నుంచి మొదలయ్యాయి) మొదలెట్టారు. బాధితుల్ని పరామర్శిస్తూ.. అధికారులకు ఆదేశాలిస్తూ.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న వరాలిస్తున్న ఆయన మాటలు తాత్కాలికంగా సంతృప్తి ఇచ్చినా.. పెద్దగా ప్రయోజనం ఉండటం లేదన్న భావన బాధితుల్లో కనిపిస్తోంది.

దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిజాంపేట బండారీ లేఅవుట్ బాధితులుగా చెప్పారు. గురువారం కేటీఆర్ తమ వద్దకు వచ్చి.. అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తమ కడగండ్లు తీరుతాయన్న కొద్దిపాటి ఆశకు గురయ్యారు భండారీ లేఅవుట్ వాసులు. అయితే.. అలాంటిదేమీ లేకపోవటంతో.. శుక్రవారం టీవీ ఛానళ్ల సాక్షిగా తమ ఆగ్రహాన్ని మాటల్లోనే వెళ్లగక్కారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు పలు ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్ కు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది.

అల్వాల్ లోనివెన్నెలగడ్డ చెరువు వద్దకు కేటీఆర్ వెళ్లారు. ఆయన వద్దకు చేరుకున్న ఒక వృద్ధ మహిళ తమ గోసను వెళ్లబోసుకుంది. అక్కడితో ఆగకుండా కేటీఆర్ చేతిని పట్టుకొని.. తమ దీన పరిస్థితిని చూడాలంటూ తన ఇంటి వద్దకు తీసుకెళ్లింది. దీంతో భద్రతాసిబ్బంది అలెర్ట్ అయినా.. కేటీఆర్ వారించటంతో వారు ఊరకుండిపోయారు. ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి.. అక్కడి పరిస్థితిని చూసిన కేటీఆర్.. ఆమెకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరి.. కేటీఆర్ చెయ్యి పట్టుకొని మరీ తన గోస చెప్పుకున్న వృద్ధురాలికి అధికారులు ఎంత న్యాయం చేస్తారో చూడాలి.