Begin typing your search above and press return to search.
వారి రాజీనామాలు కారులో కుదుపేనా....!?
By: Tupaki Desk | 2 Feb 2019 11:57 AM GMTవారిద్దరు ఆ పార్టీకి రెండు చక్రాల వంటి వారు. వారిద్దరు ఆ పార్టీకి క్లచ్... ఎక్స్ లేటర్ వంటి వారు... వారిద్దరు పార్టీకి ఏ పరిస్ధితులలోనైన ట్రబుల్ షూటర్లు. అంతేకాదు ఒకరు పార్టీ అధ్యక్షుడి సొంత కుమార్తే అయితే మరోకరు మేనల్లుడు. వారే ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చకు కేంద్రబిందువులయ్యారు. వారేవరో ఈ పాటికే మీకు అర్దం అయి ఉంటుంది. అవును... వారే తన్నీరు హరీష్ రావు - కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం ప్రారంభమయినప్పటి నుంచి విజయం సాధించి రెండు సార్లు అధికారంలోకి రావడానికి ఈ ఇద్దరి పాత్ర ఎంతో ఉంది. పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కల్వకుంట్ల కవిత స్వయాన కుమార్తే. తెలంగాణ జాగ్రుతి సంస్దను స్థాపించి తెలంగాణ ఉద్యామాన్ని మహిళలలోకి చొచ్చుకుపోయేల చేసారు ఆమె. 2014 ఎన్నికలలో నిజామాబాద్ నుంచి ఎన్నికై లోక్ సభలో అడుగుపెట్టారు. సింగరేణి కార్మిక సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్నారు.
ఇక తన్నీరు హరీష్ రావు కేసీఆర్ కు స్వయాన మేనల్లుడు.2014 క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.అయితే హఠాత్తుగా ఏమైందో తెలియదుగాని ఈ ఇద్దరు తమ పదవులకు రాజీనామ చేసారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య అధ్యక్ష పదివికి హారీష్‌రావు తన రాజీనామ లేఖను సమర్పించారు. ఈ అనూహ్య నిర్ణయానికి పార్టీలో అందరూ ఆశ్చర్యాని వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణం ఏమై ఉంటుందా అని తర్జనబర్జనలు పడుతున్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ కవిత సింగరేణి కార్మిక సమాఖ్య పదవి - మిగిలిన సంస్దల పదవులకు శనివారం నాడు రాజీనామ చేసారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో ఈ పదవులు అడ్డు రాకుడదనే రాజీనామ చేస్తున్నట్లు చెబుతున్నారు. పైకి ఈ కారణాలు చెబుతున్న ఇద్దరు పెద్ద నాయకులు పలు పదవులకు రాజీనామ చేయడంపై తెలంగాణ రాష్ట్ర సమితిలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ రాజీనామాలు దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.