Begin typing your search above and press return to search.
కవిత చెప్పిన పర్సనల్.. పొలిటికల్ మాటలివి..
By: Tupaki Desk | 2 Nov 2016 7:43 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తిగా చెప్పొచ్చు. తెలంగాణ జాగృతి పేరిట బతుకమ్మకు కొత్త ఇమేజ్ తీసుకొచ్చిన ఆమె.. ఏదైనా విషయం మీద తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. విషయం ఏదైనా.. రియాక్ట్ అయ్యేందుకు ఏ మాత్రం మొహమాటపడని ఆమె తాజాగా ఒక ప్రముఖ ఛానల్ లో ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె నోటి నుంచి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. వాటిల్లో ఆమె వ్యక్తిగత అంశాలు నుంచి రాజకీయ పరమైనవి ఉండటం గమనార్హం. వాటిని యథాతధంగా చూస్తే..
= చాలా తక్కువమంది అదృష్ట జాతకుల్లో నేనొకరిని అని చెప్పవచ్చు. బాల్యం నుంచి మహిళల వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించే కుటుంబంలో పుట్టాను. నేనూ.. అన్న... మొదటి నుంచి స్వతంత్ర వ్యక్తిత్వంతో పెరిగాం. పెద్దకొడుకు పుట్టినప్పుడు ఆ సన్నివేశం అలా గుర్తుండిపోయింది. ఆ అనుభవం తొలిసారి కదా. అదొక సుందర క్షణం. నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. తనకు గుండెపోటు వచ్చింది. చాలా బాధేసింది. తర్వాత నాన్న దీక్ష చేసినప్పుడు కూడా భయంకరమైన హింస. ఒకవైపు ఉద్యమంలో చిన్న వయసు పిల్లలు చనిపోవడం - నాన్న అరెస్టు కావడం - ఉద్యమం ఏమవుతుందో తెలీదు. అలాంటి సమయం శత్రువులకు కూడా రాకూడదు.
= 2006 డిసెంబర్ లో కేసీఆర్ తొలిసారి రాజీనామా చేసిన రోజే నేను తొలిసారిగా బయటకు వచ్చాను. అప్పుడే తెలంగాణ పల్లెల్లో పేదరికం చూసి చాలా ప్రభావితం అయ్యాను. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని రకాలుగా చదువుకుని మనం ఇంట్లో కూర్చుంటే ఎలా? మనమే ఏదో ఒకటి చేయాలి అనే ఉత్తేజం వచ్చింది.
= బ్రహ్మదేవుడు కూడా బాబును కాపాడలేరన్న కేసీఆరే రాజీపడ్డారా అన్న ప్రశ్నకు.. కాంప్రమైజ్ అని నేననుకోను. ఒక వేళ నిజంగా అంత సీరియస్ టాక్ ఉంటే దాన్ని మేం పెద్ద విజయం కిందే భావిస్తాం కదా. కొన్ని కేసులు లీగల్ ఇష్యూలుగా మనం ప్రారంభించేంత వరకే మన చేతిలో ఉంటాయి. ఆ తర్వాత లీగల్ వ్యవహారాలు ఎలా సాగుతుంటాయో తెలిసిందే. మనం తొందరపెట్టినంత మాత్రాన కొన్ని కేసులు పరిష్కారం కావు. తొందర పెట్టనంత మాత్రాన పరిష్కారం కాకుండా ఉండవు. లీగల్ క్రమంలో కేసు ఎప్పుడు తేలుతుందో తెలీదు కదా. ఆ కేసులో ఇబ్బందిలో ఉన్నది మా ప్రత్యర్థే కదా.. వాళ్లను రక్షించుకుని మేం సాధించేదేముంది? పైగా అలాంటి తెరవెనుక చర్యలు కేసీఆర్ ఎప్పుడూ చేయరు. బాబు ఎందుకు హైదరాబాద్ వదలి వెళ్లారన్నది ఆయన సమస్య. నిజానికి ఆయన అక్కడికి వెళ్లటం అనేది మంచిది. అక్కడ ప్రజలకు దగ్గరగా పాలన ఉంటుంది. అక్కడే ఉంటే పాలన మరింత వేగంగా జరుగుతుంది.
= టీఆర్ ఎస్ ఎన్నికల్లో గెలిచాక పెట్టిన తొలి ప్రెస్ మీటింగులోనే ఇవ్వాళ్టినుంచి మేం ఫక్తు రాజకీయ పార్టీగా ఉంటామని కేసీఆర్ చెప్పారు. ఎందుకంటే - తెలంగాణలో ఒక బలమైన రాజకీయ శక్తి అవసరం ఉంది. అది టీఆర్ ఎస్సే కావాలి. తెలంగాణలో ఒక శక్తి బలంగా ఎదిగి అభివృద్ధి చెందితే చూడలేని శక్తులు కూడా ఉన్నాయి. రాష్ట్రం ఇలాగే ఉండాలి. వీళ్లు అల్లాడుతూనే ఉండాలి. మేం రాజ్యం ఇలాగే చేస్తూనే ఉండాలి అనే కాంక్ష చాలామందికి ఉంది. ఇలాంటి వారందరినీ మేం అదుపు చేస్తూ బలమైన పార్టీగా ఎదిగితేనే రేపు తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్షగా ఉంటుంది.
= కోదండరామ్ - కేసీఆర్ ఇప్పుడెందుకు దూరంగా ఉంటున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రాథమికంగా కోదండరామ్ టీఆర్ ఎస్ పార్టీ మనిషి కాదు. కేసీఆరే స్వయంగా ఆయనను తీసుకొచ్చి జేఏసీకి చైర్మన్ గా చేశారు. ఉద్యమంలో కలిసి పనిచేశాం. ప్రభుత్వం వచ్చాక కలిసి పనిచేయాలా వద్దా అనేది ఆయా వ్యక్తులు - సంస్థల నిర్ణయాల పైనే ఆధారపడి ఉంటుంది. మావైపు నుంచి పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని కోదండ రామ్ పై ఎవరికీ వ్యతిరేకత లేదు. కోదండరాంకు అపాయింట్ మెంట్ ఇవ్వడం.. ఇవ్వకపోవడం కాదు సమస్య. ప్రభుత్వం సమస్య లను పరిష్కరిస్తుందా లేదా అనేది తొలి ప్రశ్న. కోదండరామ్ సర్ చెప్పిన వంద విషయాల్లో మేం ఎన్ని చేయగలమో అవన్నీ చేస్తున్నాం. అందులో అనుమానమే లేదు. కానీ వారు కూడా ఒక రాజకీయనేతగా విమర్శ చేస్తే వారి స్థాయిని తగ్గించుకోవడమే అవు తుంది తప్ప మరొకటి కాదు. కోదండరామ్ తో మాకు వైరం ఏముంటుంది. ఆయన మాకు సహజ మిత్రులు. కాదని వారనుకుంటే మేమేం చేయలేం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/