Begin typing your search above and press return to search.
కవిత కొత్త నినాదం...జై ఏబీఎన్ ఛానెల్
By: Tupaki Desk | 18 April 2017 10:53 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చురుకైన రాజకీయ వేత్తగా అతి తక్కువ కాలంలో పేరు సంపాదించుకున్నారు. కవిత ఇటీవలి కాలంలో తన వేగం పెంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆమె వివిధ అంశాలపై స్పందించారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్ తో ఎంపీ కవిత మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వారసత్వ పోరు టీఆర్ ఎస్ పార్టీలో లేనే లేదని తేల్చిచెప్పారు. ఇదంతా గిట్టని వారు చేస్తున్న ప్రచారమని వ్యాఖ్యానించారు.
టీఆర్ ఎస్ పార్టీలో సీఎం కేసీఆరే నెంబర్ వన్ అని ఎంపీ కవిత క్లారిటీ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఒకటో నెంబర్ నుంచి వెయ్యి నంబరు వరకు కేసీఆరే ఉంటారని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. ఇటీవల రాష్ట్రంలో ఎక్కువగా పర్యటించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయనున్నారనే ప్రచారం గురించి ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తాను రాష్ట్రంలో ఉంటానా ? కేంద్రంలో ఉంటానా అన్నది కేసీఆరే నిర్ణయిస్తారని స్పష్టంచేశారు. తన సోదరుడైన మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదించమని తాను చెప్పలేదని కవిత అన్నారు. ప్రజలు టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని - పార్టీని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. కాగా, తాజాగా సభ నిర్వహించిన జగిత్యాల నుంచి అసెంబ్లీకి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ``జై తెలంగాణ జై ఏబీఎన్`` అంటూ ఎంపీ కవిత సమాధానం దాటవేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/