Begin typing your search above and press return to search.

చిరుతో సినిమా తీస్తారా మ్యాడమ్‌?

By:  Tupaki Desk   |   27 Aug 2015 5:30 PM GMT
చిరుతో సినిమా తీస్తారా మ్యాడమ్‌?
X
టీఆర్‌ ఎస్‌ బాస్‌ కెసిఆర్‌ కూతురు, నిజమాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. తెలంగాణ జాగృతి కోసం ఎంతో పాటు పడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కాస్త కళాత్మక మనసున్న కవిత అప్పుడప్పుడు సినిమాలపైనా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. కళారంగంని ప్రోత్సాహించాలన్న తపనతో ఉంటారు. తెలంగాణ సినిమా అభివృద్ధికి తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు కవిత.

లేటెస్టుగా లేడీ ఎంపీ ఓ కొత్త ఎటెంప్ట్‌ చేస్తున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పై స్త్రీలను ఎడ్యుకేట్‌ చేసేలా, మేల్కొలిపేలా ఓ సందేశాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి కవిత సమర్పకురాలిగా వ్యవహరిస్తూ పెట్టుబడులు సమకూర్చారు. లైఫ్‌ ఎగైన్‌ అనేది టైటిల్‌. అలనాటి మేటి నాయిక గౌతమి మెయిన్‌ లీడ్‌ లో, హైమా రెడ్డి డైరక్షన్‌ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నిర్మాణానికి తెలంగాణ జాగృతి సపోర్ట్‌ కవితకు ఉంది. ఇక క్యాన్సర్‌ సర్వైవింగ్‌ గురించి తీస్తున్న ఈ సినిమాలో పనిచేసే గౌతమి, హైమా ఇద్దరూ గతంలో క్యాన్సర్‌ బాదితులేనన్న సంగతి తెలిసిందే.

ఎంపీ కవిత చేసిన ఈ ప్రయత్నం మెచ్చదగినది. సమాజాన్ని మేల్కొలిపే ఓ గొప్ప ప్రయత్నమిది. అయితే ఇలాంటి మరిన్ని సమాజిక చిత్రాలు తీయాలంటే భారీగా పెట్టుబడులు సమకూర్చుకోవాలి. అలాంటప్పుడు కమర్షియల్‌ సినిమాలు తీస్తూనే, మధ్యలో ఇలాంటి ఎటెంప్ట్‌ చేస్తే మంచిది. ఎలాగూ కవిత మెగాస్టార్‌ చిరంజీవికి వీరాభిమాని. కొంపదీసి చిరుతో 151వ సినిమాకి కవిత ప్లాన్‌ చేస్తున్నారో ఏమో?