Begin typing your search above and press return to search.
అన్న ఐస్ క్రీమ్ అమ్మితే... చెల్లి చీరలమ్మింది!
By: Tupaki Desk | 17 April 2017 4:29 AM GMTఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ నేతలంతా కూలీలుగా మారిపోతున్నారు. కొందరైతే ఇప్పటికే తమ వంతుగా కూలీ వేషమేసి పార్టీ సభ కోసం తమ వంతు కూలీని జమ చేయగా... ఇప్పుడు మరింత మంది కీలక నేతలు ఈ పనిని షురూ చేశారు. మొన్న పార్టీ యువనేత - మంత్రి కేటీఆర్... కుత్బుల్లాపూర్ లో ఐస్ క్రీములను అమ్ముతూ కొత్త వేషంలో కనిపించారు. కేటీఆర్ తయారు చేసిన ఐస్ క్రీమ్ ను కొనేందుకు పార్టీ నేతలు ఎగబడగా... మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఏకంగా లక్షలిచ్చి ఒకే ఒక్క ఐస్ క్రీము కొనుక్కున్నారు.
ఆ తర్వాత టీఆర్ ఎస్ కే చెందిన మరో నేత కేటీఆర్ ఐస్ క్రీములకు లకారంలోనే చెల్లించేసుకున్నారు. ఈ లెక్కన కేవలం ఓ గంట కూడా ఐస్ క్రీమ్ వాలాగా గడపకుండానే కేటీఆర్... ఏకంగా రూ.7.30 లక్షలకు పైగా సంపాదించేశారు. ఇప్పుడు నిజామాబాదు ఎంపీగా ఉన్న ఆయన చెల్లి కల్వకుంట్ల కవిత వంతు వచ్చింది. అన్న ఐస్ క్రీములమ్మితే... చెల్లి మాత్రం చీరలమ్మేసింది. అన్నకు మాదిరే గంట వ్యవధి కూడా సేల్స్ ఉమన్ గా కనిపించని కవిత... రూ.7 లక్షలు సంపాదించేసింది.
అన్న కుత్బుల్లాపూర్ లో కూలీ వేషమేస్తే... చెల్లి మాత్రం తన సొంత నియోజకవర్గం నిజామాబాద్ లోని ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ను తన కూలీ వేషానికి ఎంచుకున్నారు. షాపులో సేల్స్ ఉమన్ గా అవతారమెత్తిన కవిత... అక్కడి కౌంటర్ లో నిలబడి చీరలు అమ్మారు. కవిత చేతి నుంచి చీరలు అందుకున్న టీఆర్ ఎస్ నేతలే ఆమెకు భారీ కూలీ ఇచ్చారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరే కూలీ అవతారమెత్తి... ఏకంగా రూ.15 లక్షల మేర సంపాదిస్తే... ఇక పార్టీ నేతలంతా కలిసి ఏ మేర సంపాదిస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/