Begin typing your search above and press return to search.

బీజేపీలోకి ఎంపీ కేశినేని నాని.. టీడీపీతో ప‌డలేక పోతున్నారా?

By:  Tupaki Desk   |   19 Oct 2021 9:02 AM GMT
బీజేపీలోకి ఎంపీ కేశినేని నాని.. టీడీపీతో ప‌డలేక పోతున్నారా?
X
టీడీపీ నాయ‌కుడు, విజ‌య‌వాడ ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నేత కేశినేని నాని.. టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నా రా? గ‌త కొన్నాళ్లుగా పార్టీతో విభేదిస్తున్న ఆయ‌న‌.. విజ‌య‌వాడ‌లో ఒంట‌రిపోరు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీకి దూర‌మ‌వ్వాల‌ని భావిస్తున్నారా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా విజ‌య‌వాడ న‌డిబొడ్డున‌.. బంద‌ర్ రోడ్డులోని బ‌స్టాండు స‌మీపంలో ఉన్న పార్టీ కార్యాల‌యం.. క‌మ్ ఎంపీ ఆఫీస్‌కు ఉన్న టీడీపీ బ్యాన‌ర్ల‌ను, ఎంపీ కేశినేని నాని.. చంద్ర‌బాబు లు క‌లిసి ఉన్న ఫొటోల‌తో కూడిన బ్యాన‌ర్ల‌ను తొల‌గించారు.

వీటి స్థానంలో టాటా గ్రూప్ చైర్మ‌న్ ర‌త‌న్ టాటా ఫొటోతో కూడిన బ్యాన‌ర్ల‌ను నింపేశారు. ఈ ప‌రిణామంతో మ‌రోసారి.. నాని సెంట‌రాఫ్‌ది టాపిక్ అయ్యారు. దీంతో నాని పార్టీ మారిపోవ‌డం ఖాయ‌మంటూ.. ప్ర‌చారం ఊపందుకుంది. నిజానికి కొన్నాళ్లుగా టీడీపీ నేత‌ల‌తో నాని విసిగిపోతున్నార‌నేది వాస్త‌వం. బెజ‌వాడ‌లో నానికి వ్య‌తిరేకంగా కూట‌ములు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఆయ‌న‌ను టార్గెట్ చేయ‌డంతోపాటు.. నాని హ‌వాకు బ్రేకులు వేసేలా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. ఈ విష‌యంపై పార్టీ అధిష్టానానికి నాని ఫిర్యాదు చేసినా.. ప‌ట్టించుకోలేదు.

ఇక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో మేయ‌ర్ అభ్య‌ర్తిగా త‌న కుమార్తె శ్వేత‌ను ప్ర‌క‌టించుకునే విష‌యం లో నాని స‌క్సెస అయిన‌ప్ప‌టికీ.. పార్టీ నేత‌ల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య ఏర్ప‌డిన విభేదాల నేప‌థ్యంలో నాని త‌న కుమార్తెను గెలిపించుకోలేక పోయారు. ఫ‌లితంగా అప్ప‌టి నుంచి నాని టీడీపీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి చూపించ‌డం లేదు. కొన్ని రోజుల కింద‌ట‌.. మాజీ మంత్రి అయ్య‌న్న వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్.. చంద్ర‌బాబు ఇంటిపై దాడి చేసేందుకు వ‌చ్చిన ఘ‌ట‌న నేప‌థ్యంలోనూ ఎంపీ నాని స్పందించ‌లేదు.

దీనిని బ‌ట్టి అస‌లు నాని.. టీడీపీ రాజ‌కీయాల్లో ఉండాల‌ని అనుకోవ‌డం లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న కూడా.తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించ‌డం.. కొన్నాళ్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను నాని అనుచ‌రులు ఖండిస్తూ.. వ‌చ్చారు. మునిగిపోయే నావ‌(బీజేపీ)లాంటి పార్టీలోకి ఎవ‌రైనా వెళ్తారా? అంటూ.. ప్ర‌శ్నించారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు ఫొటోతో ఉన్న బ్యాన‌ర్ల‌ను త‌న ఎంపీ కార్యాల‌యం నుంచి తొల‌గించ‌డం.. నాని మ‌న‌సులో ఉన్న ఉద్దేశాన్ని బ‌య‌ట పెట్టింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న బీజేపీవైపు చూస్తున్నార‌ని అంటున్నారు.

ప‌రిస్థితులు క‌నుక అనూలిస్తే.. నాని.. బీజేపీలోకి చేరే అవ‌కాశం కొట్టిపారేయ‌లేమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. వీటిపై నాని ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు. కానీ, నాని అనుచ‌రులు మాత్రం రియాక్ట్ అయి.. నాని టీడీపీలోనే ఉన్నార‌ని..ఉంటార‌ని చెబుతున్నారు.నాని ముఖ్య అనుచ‌రుడు.. ఫ‌తావుల్లా మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని భ‌వ‌న్‌లో చిన్న‌పాటి మార్పులు మాత్ర‌మే చేస్తున్నామ‌ని.. దీనిని పెద్ద‌గా చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. అంతేకాదు.. బీజేపీని మునిగిపోతున్న నావ‌గా పేర్కొన్నారు.

అంతేకాదు.. నాని.. చంద్ర‌బాబుకు పూర్తి విధేయుల‌ని.. ఆయ‌న పార్టీలోనే ఉన్నార‌ని.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యేందుకు నాని అన్నివిధాలా కృషి చేస్తార‌ని చెప్పారు. నాని మ‌రోసారి ఎంపీగా పోటీ చేయ‌నున్నార‌ని కూడా ఆయ‌న వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, పార్టీ కార్యాల‌యం లోప‌ల‌.. ర‌త‌న్ టాటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం వెనుక‌.. కేవ‌లం ర‌త‌న్ టాటా గ్రూపుతో క‌లిసి అభివృద్ధి ప‌నులు చేస్తున్నామ‌ని.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఫొటోల‌తో కూడిన ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశామ‌ని.. ఫ‌తావుల్లా వివ‌రించారు. ర‌తన్ టాటా ఫొటోల‌ను మాత్ర‌మే చేర్చామ‌ని.. ఇంత‌కు మించి ప్ర‌త్యేక‌త ఏమీ లేద‌ని వివ‌రించారు. అయితే.. నాని విష‌యం మాత్రం హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.