Begin typing your search above and press return to search.

ఆ ఒక్క సైకిల్ ఆ..ఎంపీ జీవితాన్నే మార్చింది

By:  Tupaki Desk   |   3 Jun 2022 3:28 AM GMT
ఆ ఒక్క సైకిల్ ఆ..ఎంపీ జీవితాన్నే మార్చింది
X
సంద‌ర్భం : నేడు ప్ర‌పంచ సైకిల్ దినోత్స‌వం ఈ చ‌క్రం కాల చక్రం ఈ చ‌క్రం జీవ‌న చ‌క్రం ఈ చ‌క్రం మార్పున‌కు సంకేతం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు జీవితాన్ని సైకిల్ యాత్రే మేలిమ‌లుపు తిప్పింది.

నాన్న మ‌ర‌ణం త‌రువాత అనివార్య స్థితిగ‌తుల నేప‌థ్యంలో ఆయ‌న ఇటుగా వ‌చ్చారు. రాజ‌కీయం అంటే పె ద్ద‌గా తెలియ‌దు. న్యూయార్క్ వీధుల‌లో చ‌దువుకునే కుర్రాడు ఆక‌స్మికంగా ఇటుగా రావాల్సింది.వ‌చ్చాడు.

త‌రువాత ఏం చేస్తే తాను ప్ర‌జ‌లకు చేరువ అవుతాన‌న్న ఆలోచ‌న‌లో భాగంగా 23 రోజులు.. రోజుకు 25 నుంచి 30 కిలోమీట‌ర్లు శ్రీ‌కాకుళం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం సైకిల్ యాత్ర చేశాడు.

మంచి పేరు తెచ్చు కున్నాడు. అప్ప‌టికే కొన్ని పాట‌లు కూడా త‌న స్నేహితుడు మెండ దాసునాయుడు తో క‌లిసి సిద్ధం చేయించారు. ఆ పాటలు కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇప్ప‌టికీ ఆ రోజు సైకిల్ యాత్ర‌లో త‌న‌కు తోడున్న వారంద‌రినీ రాము క‌లుస్తారు. మాట్లాడ‌తారు. నాటి జ్ఞాప‌కాలు త‌ల్చు కుని, వీలున్నంత మేరకు వారికి సాయం చేసి పంపుతారు.

మాటొక్క‌టే మ‌న‌సును గెలిచే మంత్రం.మాటొక్క‌టే దిగులు బ‌రువును తీర్చే తంత్రం.. కాల చ‌క్రం కదులుతోంది. ఆ కుర్రాడు రెండోసారి కూడా ఎంపీ అయ్యారు. ఒక్క‌టే అన్నార‌ట మంత్రి బొత్స అమ్మో ! రామూను ఢీ కొన‌డం మ‌న‌కు కష్టం అండి అని జగ‌న్ కు చెప్పి వ‌చ్చారు.

ఇప్ప‌టికీ పార్టీల‌క‌తీతంగా ఆ కుర్రాడి పేరు దేశ రాజ‌ధానిలో మారుమోగుతోంది. కనుక ఈ చ‌క్రం కాల చ‌క్ర‌మే కాదు జ్ఞాప‌క చ‌క్రం కూడా ! దటీజ్ రాము.డియ‌ర్ స‌ర్ ఆల్ ద బెస్ట్