Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ తండ్రీ కొడుకుల పార్టీ.. కొండా విమర్శలు

By:  Tupaki Desk   |   13 Oct 2021 9:38 AM GMT
టీఆర్ఎస్ తండ్రీ కొడుకుల పార్టీ.. కొండా విమర్శలు
X
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇప్పుడున్నది టీఆర్ఎస్ పార్టీ కాదు.. అది తండ్రీ కొడుకుల పార్టీ అని చెప్పుకొచ్చారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

ఈ సందర్భంగా తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు. ఎంతో మంది డిగ్రీలు చదువుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70శాతం యాంటీ కేసీఆర్ ఓట్లు పడ్డాయని విమర్శించారు. అక్కడ చాలా ఓట్లు బోగస్ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ ను అభిమానించే వారి సంఖ్య 20శాతం లోపేనని.. టీఆర్ఎస్ కు ఓటు బ్యాంకు హుజూరాబాద్ లో లేదని స్పష్టం చేశారు.

హుజూరాబాద్ లో కేసీఆర్ జరుగుతున్నది కేసీఆర్, ఈటల మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. డబ్బుతో మద్యం సీసాలతో ఓట్లు సంపాదించాలని చూస్తున్నారని అన్నారు.

ఖచ్చితంగా ఈటల రాజేందర్ వల్లనే దళితబంధు వచ్చిందని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసినా ఎవరికి లాభం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. మా చేవెళ్ల ప్రాంతానికి సాగునీరు రాలేదని.. దీనికి సంబంధించి ఎన్నెన్నో అబద్దాలు చెప్పారన్నారు. ఓడిపోయే చోటకు యువరాజు కేటీఆర్ ను పంపరని కొండా హాట్ కామెంట్స్ చేశారు. అందుకే దుబ్బాకకు కూడా పంపించలేదన్నారు. హుజూరాబాద్ కు కేటీఆర్ వచ్చి ప్రచారం చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతే మా మిత్రుడు హరీష్ రావుపై ఓటమి భారం వేస్తారని అన్నారు.

హుజూరాబాద్ లో మాకు సంబంధించి 20టీంలు పార్టీలకు అతీతంగా సర్వే చేస్తూ ప్రచారం చేస్తున్నాయని.. ఎన్ని డబ్బులు పెట్టినా ఈటలకే ఓటు అంటున్నారని కొండా చెప్పుకొచ్చారు.