Begin typing your search above and press return to search.

మోడీ తొక్కేసిన అద్వానీకి మొర‌పెట్టుకుంటే ఏం లాభం?

By:  Tupaki Desk   |   11 Feb 2018 4:43 PM GMT
మోడీ తొక్కేసిన అద్వానీకి మొర‌పెట్టుకుంటే ఏం లాభం?
X
ఢిల్లీ ప‌రిణామాలు - ఏపీలో అధికార ప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు - టీడీపీ- బీజేపీ పొత్త వ‌ల్ల ఏపీకి క‌లిగే ప్ర‌యోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత - ఎంపీ కేవీపీ రామచంద్ర‌రావు మ‌రోమారు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సీనియ‌ర్ నేత ఎల్‌ కే అద్వానీతో టీడీపీ నేత‌లు భేటీ అవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని తెలిపారు. మోడీ గురించి అద్వానీకి మన కంటే ఎక్కువ తెలుసన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అద్వానీని బొటన వేలితో తొక్కి పెట్టి గాంధీ నగర్ నుంచి పోటీ చేయాలని మోడీ చెప్పార‌ని కేవీపీ వ్యాఖ్యానించారు.

బీజేపీలో అద్వానీకి తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని ఎంపీ కేవీపీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అద్వానీ మీద సీబీఐ కేస్ పెట్టి ఈ వయసులో కూడా ఓపెన్ చేయించి న్యాయ‌స్థానాల‌ చుట్టూ తిప్పుతున్నారని పేర్కొన్నారు. అద్వానీ ఆ రోజు చేపట్టిన పనుల వలన బీజేపీకి జవసత్వాలు వచ్చాయని కానీ ఇప్పుడు ఆ పార్టీలో ఆయ‌న పోరాటం చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఎంపీ కేవీపీ విరుచుకుప‌డ్డారు. మోడీ ఆస్కార్‌ కు మించిన నటుడని ఎద్దేవా చేశారు. క‌నీస‌ స్పృహ లేకుండా కాంగ్రెస్‌ ని ఉద్దేశించి లోక్‌ సభలో ప్ర‌ధాని మోడీ అసత్యాలు మాట్లాడారని మండిప‌డ్డారు. ఆయన చేసిన అసత్యాలు - అబద్దాలు - తెలియజేయాలని తాను ముందుకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

ఉమ్మ‌డి ఏపీకి సీఎంగా వ్య‌వ‌హ‌రించిన దివంగ‌త అంజయ్య మీద అపారమైన జాలి - కరుణ ప్ర‌ధాని మోడీ చూపించారని ఎద్దేవా చేశారు. ఎస్సీ అయిన ఆంజయ్యను కాంగ్రెస్ పార్టీ చాలా అవమానించింద‌ని మోడీ చెబుతున్నారని కానీ అందులో నిజం లేద‌న్నారు. లక్ష రూపాయల సూట్ - కళ్ళ అద్దాలు పెట్టుకుని అంజయ్య ఎప్పుడు లేరని ప‌రోక్షంగా మోడీని ఉద్దేశించి సెటైర్‌ వేశారు. అంజ‌య్య మాములు కూలీగా - సామాన్యుడిగా ఉండేవారని తెలిపారు. 1957 నుంచి చనిపోయేంత వరకు అంజయ్య కాంగ్రెస్ లోనే ఉన్నారన్నారు. ఆయనకి కుల బలం లేదని..ప్రజా బలం ఉందని అన్నారు. అంజయ్య చనిపోయాక కూడా అయనను కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని ఎంపీ కేవీపీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంజయ్యకి ఎన్ని చేసినా ఎస్సీ అయిన అంజయ్యను అవమానించారని మోడీ మాట్లాడుతున్నారి వ్యాఖ్యానించారు.