Begin typing your search above and press return to search.

ఇంట్లో పిడకలతో పొగవేస్తే కరోనా సోకదట .. మంత్రి కీలక వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   8 March 2021 1:30 PM GMT
ఇంట్లో పిడకలతో పొగవేస్తే కరోనా సోకదట .. మంత్రి కీలక వ్యాఖ్యలు !
X
ప్రపంచంలో కరోనా మహమ్మారి జోరు ఇంకా తగ్గలేదు. ప్రపంచంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి ఎక్కువగా నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనాను నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గదర్శకాలు జారీ చేశాయి. మరోవైపు కరోనా టీకా పంపిణీ చురుకుగా సాగుతుంది. అయినప్పటికీ రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సాంస్కృతిక మంత్రి ఉషా ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడల ధూపంతో కరోనా దరిచేయంటు కామెంట్ చేశారు. కరోనా నుంచి కాపాడేందుకు వైదిక జీవన విధానాలను అనుసరించాలని ఉషా ఠాకుర్ పేర్కొన్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఆవు పేడ పిడకలపై నెయ్యివేసి వెలిగిస్తే వచ్చే పొగతో ఇల్లంతా శానిటైజ్ అవుతుందని, దీని ప్రభావం 12 గంటల వరకూ ఉంటుందని అన్నారు.

కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు వైదిక జీవన విధానాన్ని అనుసరించాలని కోరారు. ఇండోర్‌లోని ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిన మంత్రి.. వైదిక జీవన విధానాన్ని అనుసరించాలని కరోనా మహమ్మారి మనకో సందేశం పంపిందన్నారు. తన సూచన చాలామందికి వింతగా అనిపించొచ్చని, కానీ ఈ చిట్కా గంటలపాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతుందని పేర్కొన్నారు. ఇది కూడా సైన్సేనని ఉషా ఠాకూర్ పేర్కొన్నారు. ఆవు పాలతో తయారు చేసిన నెయ్యితో దీపాలు వెలిగించి పూజలు చేయాలని అన్నారు. కరోనా వైరస్ ద్వారా మనం మళ్లీ వేద జీవనశైలికి అలవాటు పడక తప్పదన్నారు.