Begin typing your search above and press return to search.
భర్త వేధిస్తే బ్యాట్ తో కొట్టమంటున్న మంత్రి
By: Tupaki Desk | 1 May 2017 5:01 AM GMTఅధికారంలో ఉన్నవారికి కొత్త ఐడియాలు వస్తుంటే ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇదే మార్గం. కుటుంబ కలహాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సింది పోయి చావబాదడమే పరిష్కారమని తేల్చేశారు ఓ మంత్రిగారు. అంతేకాదు అందుకు తగిన సామాగ్రిని సైతం అందించేంశారు. మధ్యప్రదేశ్ మంత్రి గోపాల్ భార్గవ నూతన వధువులకు వినూత్నమైన కానుకలు అందజేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయన సొంతూరు ఘర్హకోటాలో సామూహిక విహాహాలు పెండ్లిళ్లు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వధువులందరికీ క్రికెట్ బ్యాట్ లను కానుకగా అందజేశారు. దీంతో పెండ్లి కూతుళ్లు అవాక్కయ్యారు. ఈ బ్యాట్ లను ఏంచెయ్యాలో అర్థంకాక ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి గోపాల్ భార్గవ కలుగజేసుకొని ``బ్యాట్ లను ఏంచెయ్యాలో అని ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. ``కాపురం పెట్టాక మీ భర్తలు మందు తాగినా, మిమ్మల్ని హింసించినా ఈ బ్యాట్ తో చితకబాదండి. అప్పుడు దారికొస్తారు`` అని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని పలువురు మహిళలు తాగుబోతు భర్తల గురించి ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇకపై కొత్తగా పెళ్లి అయిన వారికి కూడా అలాంటి పరిస్థితి తలెత్తకూడదన్న ఉద్దేశంతో బ్యాట్ లను ఇచ్చానని తెలిపారు. ఈ బ్యాట్ లపై ``తాగుబోతు భర్తలను కొట్టడానికి ఇస్తున్న కానుక. పోలీసులు జోక్యం చేసుకోరు`` అని కూడా ముద్రించి ఉండడం కొసమెరుపు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/