Begin typing your search above and press return to search.
పెట్టుబడుల్లో కూడా ఢిల్లీ లెక్కలతో పేచీనే!
By: Tupaki Desk | 26 Feb 2018 3:02 AM GMTముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేమో ఇక్కడ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడిపోతున్నాయంటూ ఎడాపెడా లెక్చర్లు దంచేస్తుంటారు. ఇప్పటికి మూడు సీఐఐ సదస్సులు జరిగాయి. చంద్రబాబు ఏయేటి కాయేడు చెబుతున్న లెక్కలను పరిశీలిస్తే గనుక.. ఈపాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతరానికంటె.. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేసి ఉండాలి. అందుకే ఇలాంటి కాకుల లెక్కలతో ప్రజలు వంచనకు గురవుతున్నారనే ఉద్దేశంతో.. వైఎస్సార్ సీపీ నాయకులు ఒక్కసారి శ్వేతపత్రం ప్రకటిస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయి కదా.. అని అడుగుతున్నారు.
మూడు సీఐఐ సదస్సుల ద్వారా ఇప్పటిదాకా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంత మేరకు? అనే వాస్తవాల్ని ప్రజలకు విపులంతా - నిజాలను తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని వారు అంటున్నారు. వందల కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని వెచ్చించి... ఈ సీఐఐ సదస్సులను నిర్వహిస్తున్నారని - ఆ ప్రజలనే తప్పుడు లెక్కలతో మోసం చేయడం మంచిది కాదని వారు చెబుతున్నారు.
ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం సంస్థ డీఐపీపీ వద్ద నమోదైన రికార్డుల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టబడులు వచ్చినట్లుగా కనిపించడం లేదంటూ.. వైకాపా ఎంపీ మిధున్ రెడ్డి గణాంకాల సహా తెలియజెబుతున్నారు. చంద్రబాబునాయుడు ఒకవైపు ఎడాపెడా పెట్టబుడులు వచ్చేస్తున్నట్లు వెల్లడిస్తుండగా.. ఢిల్లీ ప్రభుత్వం లెక్కల్లో అంతా తేడాగా ఉన్నట్లు తెలియడంతో ప్రజలే నివ్వెరపోతున్నారు.
ఒకవైపు రెవెన్యూ లోటు దగ్గరినుంచి ప్రతి విషయంలోనూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు ఇచ్చి మభ్యపెడుతున్నదా అనిప్రజలు అనుకుంటున్నారు. రెవెన్యూలోటు - పోలవరం ఖర్చులు - అమరావతి నిర్మాణం ఖర్చులు ఇలా ప్రతి విషయంలోనూ తప్పుడు లెక్కలు ఇస్తున్నట్లుగా రాష్ట్రప్రభుత్వం గురించి ఇప్పటికే ఢిల్లీ సర్కారు వద్ద పలు ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది.. పెట్టబడుల లెక్కలను కూడా వారికి తేడాగా చెబుతున్నారని.. ఇలాంటి నేపథ్యంలో ఒకసారి శ్వేతపత్రం విడుదల చేస్తే.. ప్రభుత్వం నిజాయితీ తేలుతుంది. విమర్శించే వాళ్ల నోళ్లకు తాళాలు పడుతాయి కదా అని పలువురు అంటున్నారు.