Begin typing your search above and press return to search.
ఎంపీ నామా కుమారుడిపై దుండగుల దాడి
By: Tupaki Desk | 2 Aug 2022 6:51 AM GMTటీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు ఫృథ్వీరాజ్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన నామా కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. నామా కొడుకు ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
నామా కుమారుడు ఫృథ్వీ తేజ కారును ఆపి కారులో ఎక్కిన దుండగులు కత్తితో బెదిరించి ఫృథ్వీతేజ నుంచి రూ.75వేలు దోచుకున్నారని పోలీసులు తెలిపారు. ఫృథ్వీ తేజ కారును అడ్డగించి దోచుకున్న వారు ఎవరనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఏమార్గంలో ప్రయాణం చేశాడో ఆ మార్గంలోని సీసీటీవీల ఫుటేజీని పరిశీలించనున్నారు. ఈ మార్గంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా? లేక ఫృథ్వీని ఎవరైనా వాహనంలో అనుసరించారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు షాపింగ్ కు వచ్చి షాపింగ్ చేసే ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో దుండగులు అతడి కారులో ఎక్కారు. కారులో ఎక్కిన తర్వాత ఫృథ్వీతేజకు కత్తి చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఫృథ్వీ నుంచి రూ.75 వేలు దోచుకున్నారు.
ఈ ఘటన జూలై 31న చోటుచేసుకుంది. అయితే ఈ విషయమై ఆగస్టు 1న రాత్రి నామా ఫృథ్వీ తేజ వ్యక్తిగత సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ దొంగలు ఎవరు? ఎందుకు దోచుకున్నారు? అసలేం జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.