Begin typing your search above and press return to search.
వివాదంలో చిక్కుకున్న వైఎస్సార్సీపీ ఎంపీ సురేశ్
By: Tupaki Desk | 10 March 2020 10:04 AM GMTఎన్నికలు అంటేనే కుల రాజకీయాలు బయటకు వస్తాయి. ఏ ఎన్నికలైనా కులం ప్రధాన భూమిక పోషిస్తుంది. అది ఎవరు ఔనన్నా.. కాదన్నా వాస్తవం. అలాంటి కులం విషయంలో రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పదవులు ఊడిపోవాల్సిందే. అయితే ఎన్నికల్లో కులం విషయంల మరింత అప్రమత్తంగా ఉండాలి. కులం ఆధారంగా చేసుకుని కొందరు రాజకీయం చేయాలని చూస్తుంటారు. అది ముఖ్యంగా గెలిచిన వ్యక్తుల కులాన్ని నిశితంగా పరిశీలించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. తాజాగా అదే పరిణామం వైఎస్సార్సీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగాం సురేశ్ విషయంలో జరిగింది.
తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలేనికి చెందిన బాపట్ల లోక్ సభ సభ్యుడు నందిగం సురేశ్ కులం వివాదంలో చిక్కుకున్నారు. 2019 ఎన్నికల్లో బాపట్ల ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గ లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందిన విషయం తెలిసిందే. సాధారణ కార్యకర్తకు ఏకంగా బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి జగన్ పోటీ చేయించి గెలిపించారు. అయితే ఆయన ఎన్నిక చెల్లదంటూ కొందరు రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ కే ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆయన క్రైస్తవుడని పేర్కొంటూ క్రైస్తవులు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత లేదంటూ రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఫిర్యాదును లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేస్తూ లేఖ పంపారు. వెంటనే విచారణ చేయించి సురేశ్ లోక్ సభ ఉండడానికి అనర్హుడంటూ లేఖలో పేర్కొన్నారు.