Begin typing your search above and press return to search.

నారా లోకేశ్ పై కామెంట్లు ఎవరూ చేసిన తప్పే

By:  Tupaki Desk   |   25 Dec 2021 9:31 AM GMT
నారా లోకేశ్ పై కామెంట్లు ఎవరూ చేసిన తప్పే
X
‘ప్రతి మనిషిలో ఈర్ష్య, అసూయలు అంటాయి. కానీ నా భార్య నాతో ఒక మాట చెప్పింది. ప్రేమ మరణం కంటే బలమైంది. అసూయ పాతాళం కంటే లోతైనది.. అని చెప్పింది. అయితే అసూయ పడేవాళ్లు నాతోనే ఉండొచ్చు. కానీ ఎవరో తెలియదు. ఇక నారా లోకేశ్ విషయంలో చేసిన కామెంట్లు ఎవరు చేసిన తప్పే.. ’ అని వైసీపీ ఎంపీ నందిగామ సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు చెప్పారు. నారా లోకేష్ పై కామెంట్లు చేయడం తప్పేనని ఒప్పుకున్నారు. దీంతో అవిప్పుడు హాట్ హాట్ చర్చకు దారితీశాయి.

నందిగాం సురేష్ మాట్లాడుతూ పలు సంచలన విషయాలు పంచుకున్నారు. ‘వైశ్య కమ్యూనిటికీ సంబంధించిన భూ వివాదంలో ప్రభాకర్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నాగేశ్వర్ రావు, నత్తయ్య అనే వ్యక్తులు రూ.10 లక్షలు డబ్బులు తీసుకొని ఆ ల్యాండ్ మాదేనని అన్నారని అతడు చెప్పాడు. ఇంతలో సన్ని అనే వ్యక్తి అక్కడికి వెళ్లాడు. చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. ఇదే సమయంలో మరికొంత మంది వచ్చి ఆ భూమి తమదేనని, తమకు సాయం చేయాలని నా దగ్గరకు వచ్చారు. అయితే నేను మాట్లాడుతానని చెప్పాను. ల్యాండ్ మీదే అయినప్పుడు బయట ఎందుకు తిరుగుతున్నారని అన్నాను. ల్యాండ్ దగ్గరకు వెళితే మమ్మల్ని కొడుతున్నారని అన్నారు. కానీ వాస్తవానికి ఎవరూ వీళ్లను కొట్టలేదు. అయితే ఆ తరువాత మరికొంతమంది ఈ ల్యాండ్ మాదేనని అన్నారు. దీంతో ఇరు పక్షాలు కోర్టులో తేల్చుకోవాలని చెప్పాను. ప్రభాకర్ అనే వ్యక్తి తన దగ్గర డబ్బులు లేవని నన్ను కోర్టు ఫీజు కట్టమన్నారు. నేను కట్టనని చెప్పాను. అదే జరిగింది’ అంటూ తనపై వచ్చిన భూవివాదంపై సురేష్ క్లారిటీ ఇచ్చారు.

‘నాకు కార్లంటే చాలా ఇష్టం. అయితే నేను సెటిల్మెంట్ చేసి కార్లు తీసుకుంటారని అంటున్నారు. అలా ఎవరి దగ్గర తీసుకున్నా ఆ వ్యక్తిని చెప్పమండి. అయితే ఇతరులకు చెప్పి ఏ కారు ఇచ్చాడో చెప్పి.. ఆ కారును తీసుకెళ్లమనండి. నేను రియల్ ఎస్టేట్ చేసినప్పుడు బైక్ లు కొనుక్కున్నా.. ఇప్పుడు కిస్తీలు కట్టి కారు కొనుక్కున్నా..జగన్ గారు రెండు కార్లు ఇచ్చారు.. ఆ తరువాత వాయిదాల పద్దతిలో కార్లు కొనుక్కున్నా..’ అని తన కార్ల ఆరోపణలపై సురేష్ స్పష్టతనిచ్చారు.

‘జగన్ గారికి మాకు ఎంతో అనుబంధం ఉంది. వాస్తవానికి మా ఇంటికి జగన్ గారు రాకపోయుంటే మేం ఈ ఊరి వదిలి వెళ్లేవాళ్లం. బయట కూడా మమ్మల్ని పట్టించుకునేవాళ్లు లేరు. పొలాలు తగలబెట్టిందాంట్లో మాపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇక నా నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే నన్ను పిలిచిన ప్రతీ కార్యక్రమానికి వెళ్తాను.. పిలవకపోతే మాత్రం వెళ్లను.అయితే ప్రజలతో మాత్రం ఎప్పటికీ టచ్ లోఉంటా. నా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు ఓ ఫ్యామిలీనే పెట్టా. ఓ కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి వారితో కలిసుంటా. ’ అని సురేష్ వివరించారు.

‘నా నియోజకవర్గంలో అనవసరంగా దూరుతున్నారరని ఎమ్మెల్యే శ్రీదేవి గారి జగన్ కు కంప్లెయింట్ చేయవచ్చు. కానీ వీళ్లంతా మధ్యలో వచ్చినవాళ్లే. జగన్ ఏం చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నాను. అంతేగానీ మధ్యలో వచ్చిన వాళ్లను పట్టించుకోను. జగన్ మోహన్ రెడ్డి గారు కోప్పడితే నేను ఆలోచించుకుంటా.. కానీ ఎవరు ఏం చేసినా నేను పట్టించుకోను.శిలా ఫలకంపై నా పేరు కింద పెడుతున్నారు.అయితే ఈ విషయంలో మా కుర్రాళ్లకు ఆవేశం వచ్చింది. కానీ సర్దుకుపోవాల్సిన సమయంలో సర్దుకుపోవాలి. ’

‘నన్ను ఎన్ కౌంటర్ చేద్దామని అనుకున్న సీఐ నేను గెలిచిన తరువాత నన్ను కలుస్తానని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇన్ని రోజులు నా గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మరిచిపోయా. మళ్లి ఇప్పుడు నువ్వు ఫోన్ చేయగానే అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. అందువల్ల పాత మనిషిని కావడానికి ట్రై చేయకు అని చెప్పా. మీకేదైనా జాబ్ విషయంలో సమస్య ఉంటే చెప్పండి.. మీ దగ్గరికి రాకుండానే సమస్యను పరిష్కరిస్తా.. అని చెప్పా’ అని సీఐతో వివాదంపై సురేష్ స్పందించారు.