Begin typing your search above and press return to search.
సీఎం జగన్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఎంపీ రఘురామ
By: Tupaki Desk | 9 Jan 2021 10:45 AM GMTఏపీ సీఎం జగన్ కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ధన్యవాదాలు చెప్పడం రాజకీయంగా సంచలనమైంది. ఎప్పుడూ జగన్ ను తీవ్రంగా విమర్శించే రఘురామ ఆశ్చర్యకరంగా పొగడడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఏపీలో ఆలయాలపై దాడులు.. విగ్రహాల ధ్వంసాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే విజయనగరం రామతీర్థం రాముడి విగ్రహ ధ్వంసం కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ క్రైస్తవ మతాన్ని అనుసరించే వ్యక్తి అని ఆయనతో విచారణ జరగదని జగన్ సర్కార్ తీరుపై ఎంపీ రఘురామ మండిపడ్డారు. ఈ కేసు ఆయనకు అప్పగించడం వల్ల విచారణ సరిగా జరగదేమో అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీ నుంచి జగన్ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాన్ని రఘురామ స్వాగతించారు. దీంతో ఈ నిర్ణయాన్ని రఘురామ స్వాగతించారు. సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
సీనియర్ పోలీస్ అధికారి అశోక్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా 16మందితో సిట్ ఏర్పాటు చేసి వారికి అప్పగించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆలయాలు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తును సీఐడీ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయడంపై రఘురామ స్వాగతించారు.