Begin typing your search above and press return to search.
తిరుపతి దొంగ ఓటర్లపై రఘురామ పోరుబాట
By: Tupaki Desk | 23 April 2021 5:32 AM GMTవైసీపీ సర్కార్ ను, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో వివాదాస్పద అంశాన్ని లేవనెత్తారు.తిరుపతిలో దొంగ ఓటర్ కార్డులను ముద్రించడాన్ని దేశద్రోహ నేరంగా పరిగణించాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా ఏకంగా కేంద్రహోంశాఖకు లేఖ రాసి సంచలనం సృష్టించారు.
దేశ సార్వభౌమాధికార, సమగ్రతకు, దొంగ ఓటర్ కార్డులు తయారు చేయడం ప్రమాదకరమని రఘురామకృష్ణం రాజు ఏకంగా హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లక్ష్యాలకు ఇలాంటి పనులు చేయడం వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో లక్షలాది దొంగ ఓటర్ కార్డులు ముద్రించారని తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తిరుపతిలో దొంగ ఓటర్ల అంశాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ జరుపాలని.. లేకపోతే భారత్ లో ఇలాంటి ఐడీకార్డులు తయారు చేయడం.. ఓటు వేయడం సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడడం పెరిగిపోతుందని రఘురామ డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్టు ఎంపీ రఘురామ తెలిపారు.
వెంటనే ఈ తిరుపతి దొంగ ఓటర్లపై ఎన్ఐఏ ద్వారా విచారించాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. రఘురామ ఈ దొంగ ఓటర్లపై వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. దీనిపై కేంద్రంతో పోరాడి ఎలాగైనా విచారణ జరిపేలా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.