Begin typing your search above and press return to search.
మా ఆయనకు సోరియాసిస్సా? నాకు తెలియదే? ఆర్ఆర్ఆర్ భార్య షాక్..!
By: Tupaki Desk | 17 May 2021 7:30 AM GMTగత రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆర్ఆర్ఆర్ ( నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ) వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఆర్ఆర్ఆర్ ఏపీ ప్రభుత్వంపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. అయితే ఇటీవల డోసు మరీ పెంచారు. ముఖ్యంగా ఓ రెండు మీడియా చానల్స్‌లో ఆయన మాటలకు అడ్డుఅదుపులేకుండా పోయాయి. గతంలో ప్రభుత్వ విధానాలపై మాట్లాడే రఘురామ ఇటీవల ఏకంగా వ్యక్తిగత దూషణలకు దిగారు.
నేరుగా సీఎం జగన్ మోహన్‌రెడ్డిని ఆయన కులాన్ని.. వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ కనిపించారు. టీడీపీకి అనుకూలంగా ఉండే రెండు మీడియా చానల్స్ కూడా వీటిని ప్రముఖంగా ప్రసారం చేశాయి.మరోవైపు సోషల్ మీడియాలోనూ రఘురామకు అనుకూలంగా వ్యతిరేకంగా పోస్టులు వెల్లువలా వచ్చాయి. రఘురామ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం చాలా రోజులు వేచి చూసింది. చివరకు ఆయన వ్యవహార శైలి శృతిమించడంతో ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులు రఘురామను అదుపులోకి తీసుకొన్నారు. ఆయనపై కొన్ని బలమైన సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టారు.
ఇదిలా ఉంటే రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించడంతో తనను సీఐడీ పోలీసులు కొట్టారని.. తన కాళ్లకు గాయాలయ్యాయని ఏకంగా న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించించింది.డాక్టర్ల బృందం రఘురామ కృష్ణం రాజుకు పరీక్షలు నిర్వహించింది. ఆయనపై పోలీసులు దాడి చేయలేదని తేల్చి చెప్పింది. ఆయనకు సొరియాసిస్ లాంటి చర్మ వ్యాధి ఉందని.. అందుకే పాదాలు కమిలిపోయాయని డాక్టర్లు చెప్పారు.
అయితే ఈ విషయంపై
రఘురామ కృష్ణంరాజు సతీమణి రమాదేవి ఓ టీవీ చానల్ లో మాట్లాడారు. ‘ మా ఆయనకు సొరియాసిస్ ఉండే అవకాశమే లేదు. ఒకవేళ ఉంటే ఇన్నేళ్ల మా కాపురంలో నాకు తెలుస్తుంది కదా’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు తన భర్తను హత్యచేసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఈ కేసు ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.