Begin typing your search above and press return to search.
ఇప్పుడే నిద్రలేచిన ఎంపీ
By: Tupaki Desk | 1 Sep 2021 8:30 AM GMTతాను కూస్తేగాని ఊరికి తెల్లారాదన్న కోడి లాగా తయారైంది వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం. ఇపుడే హఠాత్తుగా నిద్రలేచినట్లున్నారు అందుకనే టీటీడీ కల్యాణమండపాలపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపాలను లీజుకు ఇచ్చే అధికారం ఎవరిచ్చారంటు టీటీడీని ఎంపి ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. తమ ఆస్తులను లీజుకిచ్చే అధికారం టీడీపీకి ప్రత్యేకంగా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు.
భక్తులు ఎంతో భక్తితో స్ధలాలను విరాళంగా ఇస్తే కల్యాణ మండపాలను లీజుకిచ్చేటపుడు స్ధల దాతలకు చెప్పాల్సిన అవసరం లేదా అంటు పిచ్చి లాజిక్ లేవనెత్తారు. స్ధలాలను భక్తులు టీటీడీకి రాసిచ్చేసిన తర్వాత పూర్తి హక్కుదారు టీటీడీనే అవుతుంది. కాబట్టి వాటి ఉపయోగంలో మళ్ళీ ఆస్తులను విరాళమిచ్చిన భక్తులను ఏ విషయంలో కూడా సంప్రదించటమంటు ఉండదు. టీటీడీ బోర్డు లేదా స్పెసిఫైడ్ అథారిటి నిర్ణయమే ఫైనల్ అన్న విషయం ఎంపికి తెలీదా ?
ఇక్కడ విచిత్రమేమిటంటే టీటీడీ కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వడం అన్నది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మొదలైనట్లుగా తిరుగుబాటు ఎంపి ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. టీటీడీ ఆస్తులు లేదా కల్యాణ మండపాలు దశాబ్దాలుగా లీజులకు ఇస్తునే ఉన్నారు. నిర్వహణ సాధ్యం కానపుడు, ఆదాయాలు రావటం లేదన్నా లేదా ఆదాయానికి మించి నిర్వహణ వ్యయం పెరిగిపోతోందని అనుకున్నా సదరు ఆస్తులను లీజుకు ఇచ్చేయటమో లేదా అమ్మేయడం చేస్తోంది టీటీడీ.
చంద్రబాబునాయుడు హయాంలో ఇలాంటి ఆస్తులను లీజుకు ఇచ్చింది టీటీడీ. కొన్ని భూములను అమ్మకానికి పెట్టిన విషయం ఎంపికి తెలీదా ? ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నా తప్పుపట్టాలనే సింగిల్ అజెండాతో రఘురామ ముందుకెళుతున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించటమని అడగడంలో తప్పులేదు. నిధుల దుర్వినియోగం జరిగినపుడు ప్రశ్నించటంలో కూడా తప్పులేదు. అంతేకానీ ఆ నిర్ణయం తీసుకోవటానికి ప్రభుత్వానికి ఏమి అధికారం ఉంది ? ఈ నిర్ణయం తీసుకోవటానికి టీటీడీకి ఏమి అధికారం ఉందని ప్రశ్నించడమే విచిత్రంగా ఉంది.
ఓట్లేసి గెలిపించటం ద్వారా ప్రజలే వైసీపీకి అధికారమచ్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పరిపాలన బాగా లేదని అనుకుంటే వచ్చే ఎన్నికల్లో జనాలే వైసీపీ ప్రభుత్వాన్ని దింపేస్తారు. అంతేకానీ జగన్ మీద కసితో, గుడ్డి వ్యతిరేకతతో నోటికొచ్చినట్టు మాట్లాడితే తానే పలుచనైపోతామని ఎంపి గ్రహించటంలేదు. ప్రభుత్వ నిర్ణయాలు అసంబద్దంగా ఉన్నాయంటు కోర్టుకెళ్లే అవకాశం ఎలాగూ ఉంది. కాబట్టి కళ్యాణమండపాల లీజు విషయంలో ఎంపి వాస్తవాలు గమనించి మాట్లాడాలి.