Begin typing your search above and press return to search.
ఎంపీ రఘురామ కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
By: Tupaki Desk | 17 May 2021 9:43 AM GMTవైసీపీ రెబల్ ,ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి ఎంపీ రఘురామని తరలించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజే ఆయనని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని , అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జ్యుడిషియల్ కస్టడీ లో భాగంగానే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే , తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామ ఉంటారని స్పష్టం చేసింది. వైద్య పరీక్షలు వీడియోగ్రఫీ చేసి , సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని కోర్టుకు సమర్పించాలని సుప్రీం తెలిపింది. రెండు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలనీ, రఘురామ మెడికల్ రిపోర్టును తెలంగాణా సీజే సుప్రీంకోర్టుకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షల ఖర్చు ఎంపీనే భరించాలంది
ఇక , ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిగింది. ఎంపీ రఘు రామకృష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని సుప్రీంకోర్టుకు సీఐడీ లాయర్ దుష్యంత్ దవే తెలిపారు. సీనియర్ జ్యుడీషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలకు సిద్ధమని అన్నారు. సమీపంలో ఆర్మీ ఆస్పత్రులున్నాయా, అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, 300 కి.మీ. దూరంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఉందని, విశాఖలో నేవీ ఆస్పత్రి కూడా 300 కి.మీ దూరంలో ఉందని లాయర్ రావు తెలిపారు. విశాఖలో తుఫాను పరిస్థితులున్నాయని, కేంద్రం ఆధీనంలోని మంగళగిరి ఎయిమ్స్ అన్నింటికంటే దగ్గరగా ఉందని లాయర్ దవే వివరించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి ఎంపీ రఘురామని తరలించాలని తెలిపింది. అలాగే ఆయన వేసిన బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా వేసింది.