Begin typing your search above and press return to search.
రఘురామపై వైసీపీ సంధించే అస్త్రం ఇదే!
By: Tupaki Desk | 26 Jun 2020 8:01 AM GMTవైసీపీలో అసమ్మతి రాజేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఇటీవలే వైసీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై చర్యలు తీసుకోవడానికి పావులు కదుపుతోంది. వేటు వేసేందుకు సిద్ధమైంది. అయితే తాజాగా రఘురామకృష్ణం రాజు వైసీపీకి ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఇచ్చిన సమాధానం అందరినీ షాక్ కు గురిచేసింది.
ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణం రాజును ఊరికే వదిలిపెట్టవద్దని.. పార్టీకి వ్యతిరేకంగా తయారైన ఆయనపై బలమైన అస్త్రం ప్రయోగించేందుకు వైసీపీ రెడీ అయ్యిందట.. వైసీపీ సరికొత్త అస్త్రాన్ని రఘురామకృష్ణం రాజుపై ప్రయోగిస్తుండడం చర్చనీయాంశమైంది.
రఘురామపై వలంటర్లీ గివెన్ ఆఫ్ ది మెంబర్ షిప్ టు ద పార్టీ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన ప్రకారం.. చర్యలు తీసుకోవాల్సి వస్తే.. రఘురామకృష్ణం రాజు లోక్ సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోవడం ఖాయం. ఇదివరకు ఇలానే జనతాదళ్ (యూ) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ పై ఈ నిబంధన కిందే అనర్హుడిగా ప్రకటించారు.
రఘురామకు వైసీపీ పంపించిన నోటీసుల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వలంటర్లీ గివెన్ ఆప్ ద మెంబర్ షిప్ టు ద పార్టీ కింద రఘురామపై చర్యలు తీసుకుంటే అతడు తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయం. అది కూడా మూడు నెలల్లోనే. ఈ నిబంధన కింద వైసీపీ నాయకులు ఫిర్యాదు చేసిన మూడు నెలల్లోపే లోక్ సభ స్పీకర్ సభ్యుడిపై వేటు వేయాల్సి ఉంటుంది. దీంతో రఘురామ ఎంపీ పోస్టును ఊడబీకేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.