Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ మూవీకి ఏపీ రాజకీయాలకు లింకు పెట్టేసిన ఎంపీ రఘురామ
By: Tupaki Desk | 2 Aug 2021 11:33 AM GMTరాజకీయ వ్యతిరేకుల మీద విరుచుకుపడటం తప్పేం కాదు. కానీ.. దానికి పద్దతి పాడు ఉండాలి కదా? అంతకు భిన్నంగా ఏకపక్షంగా విరుచుకుపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సొంత పార్టీ అధినేతపై అదే పనిగా విమర్శలు చేయటం.. ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం లక్ష్యంగా పెట్టుకున్న నరసాపురం ఎంపీ రఘురామ తాజాగా మరో సంచలనానికి తెర తీశారు. సంచలన విజయంతో పాటు.. సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్న కేజీఎఫ్ మూవీని తన తాజా విమర్శలకు వాడుకున్న వైనం ఆసక్తికరంగా మారింది.
ఏపీలో కేజీఎఫ్ కు సినిమాకు స్టోరీలు తయారవుతున్నాయన్నారు. ''కర్ణాటకలోని కేజీఎఫ్ లో ఎవర్నీ లోపలకు రానివ్వరు. అక్కడికి వెళితే చంపేస్తారు. అక్కడ కోలార్ లో గోల్డ్ మైన్లు ఉంటే.. ఇక్కడ మైన్లు ఉన్నాయి. కేజీఎఫ్ లో హీరో ఏదో చేస్తారు. చాప్టర్ 2 కూడా వస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 3.. 4 కూడా కథ రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి'' అని వ్యాఖ్యానించారు.
చాప్టర్ 3ను మన్యం అడవుల్లో.. చాప్టర్ 4 కొండపల్లి అడవుల్లోఉంటుందన్న ఎంపీ రఘురామ.. కరోనా తగ్గితే చాప్టర్ 3 అంటారో లేదో చూడాలన్నారు. దీనికి సంబంధించిన క్లైమాక్స్ ఎలా ఉంటుందో అన్న ప్రశ్నను సంధించారు. ఏపీలో జరుగుతున్న సంఘటల్ని చూస్తే.. తనకు అలా అనిపిస్తోందన్నఆయన.. అదంతా నిజమో.. కాదో ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
తాను ప్రాతినిధ్యం వహించే పార్టీ దెబ్బ తినకూడదని తాను ముఖ్యమంత్రికి ఈ విన్నపాన్ని చేస్తున్నట్లుగా చెప్పారు. ఎవరైనా తప్పులు చేస్తే శిక్షించాల్సిన ప్రభుత్వం.. మరి ప్రభుత్వమే తప్పులు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. మొత్తానికి ఏపీ సర్కారును టార్గెట్ చేసినట్లుగా ఉన్నరఘురామ వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఏపీ అధికారపక్షాన్ని ఇరుకున పడేలా చేశాయి.