Begin typing your search above and press return to search.
ఆ బుడ్డోడే ఏపీ ప్రజలకు స్ఫూర్తి : ఎంపీ రఘురామ
By: Tupaki Desk | 27 Oct 2021 11:30 AM GMTఎంపీ రఘురామ వారంలో ఒకటి రెండు సార్లు మీడియాతో మాట్లాడనిదే ఆయనకు పొద్దు గడవదు. ఢిల్లీలో ఉంటున్న ఎంపీ రఘురామ.. సీఎం జగన్ తో పెట్టుకున్నాక.. ఆయనను అభాసుపాలు చేయడమే పనిగా పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ ఏ విషయం దొరుకుతుందో బుక్ చేద్దామన్నట్టుగానే చూస్తున్నాడు.
తాజాగా విశాఖపట్నంలో మొన్న ఓ 10 ఏళ్ల బాలుడు ఎయిడ్ పాఠశాలల కోసం ఆందోళన చేసిన వైనం వైరల్ అయ్యింది. ఆ వీడియోను పట్టుకొని తాజాగా ఎంపీ రఘురామ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..
ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం సమావేశం నిర్వహించారు. విశాఖలో మొన్న 10 ఏళ్ల బాలుడు మాట్లాడిన మాటలను గుర్తు చేశాడు. ఆ బుడ్డోడే నేటి రాష్ట్రప్రజలకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చాడు.
ఆ పిల్లాడు తన ఎయిడెడ్ పాఠశాల కోసం అధికారులను సైతం ఎదిరించి ఎవరూ చేయలేని సాహస ధోరణితో మాట్లాడాడని రఘురామ ప్రశంసలు కురిపించారు. జగన్ పాలనలో పిల్లలు సైతం ప్రశ్నించడం తనకు ఆశ్చర్యం వేసిందన్నారు.
ఇక అనంతరం జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఏపీలో పాలన సరిగా లేదని.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం అని చెప్పుకొచ్చాడు. జగన్ పాలన తీరును ఇప్పటికైనా మార్చుకోవాలని సూచించాడు.