Begin typing your search above and press return to search.
సంచలనం: కేసీఆర్ కు దానికోసం లేఖ రాసిన ఎంపీ రఘురామ
By: Tupaki Desk | 30 May 2021 6:30 AM GMTఏపీ సీఎం జగన్ తో ఢీకొన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజద్రోహం కేసులో అరెస్ట్ అయ్యి అష్టకష్టాల పాలయ్యారు. ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన రఘురామ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈక్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాయడం సంచలనమైంది. తన అరెస్ట్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసంచరిల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
ఇక అరెస్ట్ చేసే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదన్నారు. ఆ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో రఘురామ కోరారు.
ఈనెల 14న తన అరెస్ట్ సమయంలో ఇఛ్చిన తీర్పులు, పోలీస్ నిబంధనల ఉల్లంఘన వివరిస్తూ సీఎం కేసీఆర్ కు 8 పేజీల లేఖ రాశారు. తెలంగాణ పోలీసులు ‘రూల్ ఆఫ్ లా’ ను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ను కోరారు.
సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ బృందంతోపాటు తన నివాసానికి వచ్చిన గచ్చిబౌలి పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.