Begin typing your search above and press return to search.
సర్వేలు చేయడానికా ఎన్నుకున్నది రాజా...?
By: Tupaki Desk | 23 Aug 2022 7:37 AM GMTఈ దేశంలో రాజకీయ నాయకులకు ప్రజా ప్రతినిధులకు అన్నీ అనుకూలమైన నిబంధనలే ఉన్నాయి. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఆరు నెలల పాటు చట్టసభలకు హాజరుకాకుంటే సభ్యత్వం రద్దు అవుతుందని శాసన వ్యవస్థలో ఒక చిన్నపాటి క్లాజ్ ఒకటి పెట్టారు. అది కూడా స్పీకర్ ఫొకస్ పెట్టి అమలు చేస్తేనే తప్ప జరిగేది కాదు. అయితే ఈ చిన్నపాటి క్లాజ్ తో సభకు రాం రాం అని భీషణ ప్రతిన చేస్తున్న వారు కూడా ఎందుకైనా మంచిదని అక్కడ రిజిష్టర్ లో ఒక సంతకం అయితే జస్ట్ అలా పెట్టేసి లైవ్ లో ఉంటున్నారు.
కానీ ఇదే క్లాజ్ కానీ నిబంధన కానీ తమను ఎన్నుకున్న జనాలకు ఆరు నెలలకైనా ముఖం చూపించని నాయకుల సభ్యత్వం రద్దు అని ఎందుకు పెట్టలేదు అన్నదే మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న. ఒక నాయకుడు డబ్బు బాగా ఉండి ఒక గెలిచే పార్టీని ఎన్నుకుని టికెట్ సంపాదించి ఎంపీఓ ఎమ్మెల్యేవో అయిపోతాడు. ఆ మీదట తమ వ్యాపారాలు వ్యవహారాలూ చూసుకుంటూ అయిదేళ్ళూ వేరే చోట గడిపేస్తాడు.
మరి లక్షలాది జనాలు తమ తరఫున పనిచేయమని ఓటెత్తి గెలిపించిన తరువాత అక్కడ నాధుడిగా ఉండాల్సిన కనీస బాధ్యత నెరవేర్చకపోయినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే ఎంపీ అయ్యాక నర్సాపురం రఘురామ క్రిష్ణం రాజు లాంటి వారు అయితే ఢిల్లీలో లేకపోతే హైదరాబాద్ లో అన్నట్లుగా గత మూడున్నరేళ్ళుగా గడిపేస్తున్నా ఏమీ అనలేని నిస్సహాయత నర్సాపురం లోక్ సభ ఓటర్లది.
ఇక 2019 ఎన్నికలు అయిపోయాయి. ఎలాగోలా గెలిచేశాం, అయిదేళ్ళు ఎంపీగా హాయిగా ఉన్నాం అనుకున్నారేమో వచ్చే ఎన్నికల కోసం రాజా వారు త్వరపడి మరీ సర్వేలు చేపడుతున్నారు. ఏపీలో ఏ సర్కార్ అధికారంలోకి వస్తుంది అంటూ ఆయన ప్రత్యేక యాప్ ద్వారా సర్వేలు చేయించి వాటి ఫలితాలను బయటపెట్టి ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు గిట్టని పార్టీ వైసీపీ. ఆ పార్టీని సర్వేల పేరుతో ఓడించేశాను అన్నది అదో రకమైన తృప్తి.
సరే దాని సంగతి పక్కన పెడితే రాజా వారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం లోక్ సభ సెగ్మెంట్లో తన పనితీరు మీద ఏమైనా సర్వే చేయించుకున్నారా అన్నదే ప్రత్యర్ధుల మాటగా ఉంది. మూడేళ్ళుగా సొంత నియోజకవర్గానికి రాని తన నిర్వాకానికి జనాలు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు అన్న దాని మీద జన మనోగతం ఆయనకు ఏమైనా తెలుసా అని కూడా ప్రశ్నిస్తున్నారు.
దీనిని చూసే ప్రజలు తమ తరఫున పనిచేయమని తమ సమస్యలు తీర్చమని ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నది సర్వేలు చేయడానికి కాదని రాజా వారు ఎపుడు గ్రహిస్తారో అని కూడా అంటున్నారు. ఇక అసెంబ్లీ పార్లమెంట్ కి హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు చేయడం కాదు ప్రజా ప్రతినిధులకు అసలైన ప్రభువులు అయిన ఒటేసిన ప్రజలకు కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా ముఖం చూపని ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు చేసి పారేసే విధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం లో సవరణలు తేవాలని కూడా సూచించే వారు ఎక్కువ అవుతున్నారు.
అపుడే ప్రతీ ఎన్నికకూ గెలిచే పార్టీలను పట్టుకుని టికెట్ తెచ్చుకుని చట్ట సభలలో వెలిగిపోవాలనుకునే సంబరాల రాంబాబులకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. మొత్తానికి ఇక్కడ ఒక్క మాట. మంచి ముహూర్తం పెట్టమని శత్రువుని అడిగితే ఏకంగా మరణానికే పెడతాడు అని సామెత. రాజు గారు వైసీపీకి ఆజన్మ వ్యతిరేకి. ఆయన చెప్పే చిలక జోస్యాలు జగన్ సీఎం అవుతాడని ఎందుకు చెబుతాయన్న సగటు జనానికి ఉన్న తెలివి సర్వేశ్వరులకు లేకపోవడమే అసలైన లేకితనం అంటున్నారు.