Begin typing your search above and press return to search.
ఎంపీని పోలీసులు కొడుతుంటే.. ఫోన్ లో చూసి ఎంజాయ్ చేసిన పైవాడు ఎవడు?
By: Tupaki Desk | 20 Dec 2021 7:12 AM GMTసంచలన నిజాన్ని వెల్లడించారు నరసాపురం ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తనకు ఎదురైన షాకింగ్ అనుభవాల్ని దాపరికం లేకుండా బయటపెట్టేశారు. తనపై పెట్టిన కేసుల్లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు.. తనను తీసుకెళ్లి దర్యాప్తు పేరుతో చితక్కొట్టేశారన్నారు. రాజకీయాల్లో ఆర్ఆర్ఆర్ పేరుతో సంచలనంగా మారుతూ.. తరచూ వార్తల్లో నిలిచే ఆయన.. తాను ప్రాతినిధ్యం వహించే పార్టీ విషయంలోనూ మిగిలిన వారికి భిన్నంగా చెబుతుంటారు.
వైసీపీ నేతలంతా తాము ప్రాతినిధ్యం వహించే పార్టీ పేరేమిటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ అంటారు. కానీ.. రఘురామ మాత్రం అందుకు భిన్నంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెబుతారు.తాను పార్టీకి వీర విధేయుడ్ని అని.. పార్టీ మీద ఎప్పుడూ విమర్శలు చేయలేదని.. తాను ముఖ్యమంత్రి చేసే తప్పుల్ని మాత్రమే బయటపెడుతున్నానని చెబుతారు.
ఏపీ సర్కారుకు కంట్లో నలుసులా వ్యవహరించే ఆయన మాటల నేపథ్యంలో ఆయనపై కేసులునమోదు కావటం.. పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. అరెస్టు చేసిన తర్వాత తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని చెప్పటం తెలిసిందే. ఆ రోజున ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చూస్తే.. ‘నా జీవితంలో ఎప్పుడూ దెబ్బలు తినలేదు.
మంచి స్టూడెంట్ ను కావటంతో స్కూల్లో కూడా టీచర్లతో తన్నులు తినాల్సిన అవసరం రాలేదు. కానీ.. మొదటిదెబ్బ పోలీసు దెబ్బ పడింది. ఎంపీ అయి ఉండి కూడా కొట్టించుకోవటం ఒక రికార్డుగా మిగిలిపోయింది. సినిమాల్లో ఎవరినైనా కొడితేనే నేను బాధపడతాను. అలాంటిది నేనే తన్నులు తినాల్సి వస్తుందని ఊహించలేదు. ఆ కొట్టుడు మామూలు కొట్టుడు కాదు’’ అని వ్యాఖ్యానించారు.
తనను పోలీసులు కొట్టే సమయంలో జరిగిన విషయాల్ని ఆయన వెల్లడించారు. అయితే.. తనను కొట్టిన పోలీసు అధికారి పేరు మాత్రం రివీల్ చేయలేదు. కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఆ వివరాలు తాను వెల్లడించలేనని చెప్పిన రఘురామ.. తనను కొట్టే సమయంలో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. నాడు జరిగింది ఏమిటన్నది ఆయన మాటల్లోనే వింటే.. ‘‘నన్ను కొట్టిన అధికారి పేరు విచారణలో చెబుతాను.
అప్పటివరకు సస్పెన్స్. ఆ అధికారి ఫోన్ లో నన్ను చిత్ర హింసలు పెట్టిన వైనాన్ని తనపై వ్యక్తికి చూపించాడు. పైవాడు ఎవరంటే పైవాడే. నా ఆర్తనాదాలను చూసి ఆ పైవాడు ఆనందించాడు. స్పైడర్ సినిమాలో ఒక శాడిస్టిక్ విలన్ ఉంటాడు కదా. అలాగే ఆ పైవాడు కూడా విపరీతంగా ఆనందించాడట’ అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. ఆర్తనాదములు శ్రవణానందకరంగా ఉన్నవి అంటూ మాయాబజార్లో ఎస్వీ రంగారావు అన్నట్లు ఆ పైవాడు కూడా ఆనందించి.. ఇంకా వాయించుకోండి అన్నాడట అని పేర్కొన్నారు. రఘురామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకీ ఆ పైవాడు ఎవరన్నది రఘురామ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.