Begin typing your search above and press return to search.
తిరుగుబాటు ఎంపి పిచ్చి లాజిక్
By: Tupaki Desk | 13 Oct 2021 6:12 AM GMTవైసీపీ ప్రభుత్వానికి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కానీ ఢిల్లీలో ఇక నుండి తిరుగుండకపోవచ్చు. ఎందుకంటే పార్టీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు పార్టీతో కలిసి పనిచేస్తానంటు బంపర్ ఆఫరిచ్చారు. పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విషయాన్ని ప్రస్తావిస్తు పార్టీ కోసం, ప్రభుత్వం కోసం తాను విజయసాయిరెడ్డితో కలిసి పని చేస్తానని చెప్పారు. నిజానికి తిరుగుబాటు ఎంపీ మాటలను వైసీపీలో ఎవరు సీరియస్ గా తీసుకునే వారే లేరు.
ఎందుకంటే ఒకవైపు జగన్ ను జైలుకి పంపుతానని మంగమ్మ శపథాలు చేసి బెయిల్ రద్దు కోసం న్యాయస్ధానాల్లో కేసు వేసిన విషయం తెలిసిందే. జగన్ను మాత్రమే కాకుండా విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు కావాలంటు తిరుగుబాటు ఎంపి వేసిన పిటిషన్లను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే. సీబీఐ కోర్టు తన కేసు కొట్టేయగానే వెంటనే తిరుగుబాటు ఎంపి హైకోర్టులో కేసు వేశారు.
ఒకవైపు ఎంత చిన్న అవకాశం దొరికినా జగన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న తిరుగుబాటు ఎంపి ప్రభుత్వం కోసం విజయసాయితో కలిసి పనిచేస్తానని అంటే ఎవరైనా నమ్ముతారా ? విజయసాయిని ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్లు మరో పనికిమాలిన ప్రకటన చేశారు. రాజ్యసభ ఎంపిని, పార్టీలో కీలకనేతను ఢిల్లీలో ఉపయోగించుకోవాలని జగన్ అనుకుంటే అందులో తప్పేముంది ?
రాష్ట్రంలో ఎటూ అధికారంలో ఉన్నపార్టీకి అవసరాలన్నీ ఢిల్లీలోనే కదా ఉంటాయి. మరి ఢిల్లీలో అవసరాల కోసం ఎంపిని జగన్ ఉపయోగించుకుంటున్నారంటే చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లే కదా లెక్క. ఇందులో విజయసాయిని విశాఖపట్నంకు దూరం చేయటం ఏముంది ? రాజ్యసభ ఎంపి సేవలు ఎక్కడ అవసరమని జగన్ అనుకుంటే అక్కడ ఉపయోగించుకోవటంతో తప్పేముంది ? పనిలోపనిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైన కూడా తన అక్కసును వెళ్ళగక్కారు.
విద్యుత్ సమస్యలపై మంత్రి, ఉన్నతాధికారులు కాకుండా సజ్జల మాట్లాడటం ఏమిటంటు ప్రశ్నించారు. సజ్జల మాట్లాడితే ఏమిటి ? మంత్రి మాట్లాడితే తిరుగుబాటు ఎంపికి ఏమిటి సమస్య. సజ్జలకు అపరిమితమైన ప్రాధాన్యత దక్కుతోందన్న కడుపుమంటే ఎంపి మాటల్లో కనబడుతోంది. జగన్ అనుమతి లేకుండా సజ్జల అయినా ఇంకోళ్ళయినా మాట్లాడే అవకాశం లేనపుడు ఎవరు మాట్లాడితే ఏమిటి ? జనాలకు కావాల్సింది ప్రభుత్వం తరపునుండి సమాచారం. మొత్తానికి జగన్ బెయిల్ రద్దు విషయంలో ఫెయిలైన ఎంపి నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నట్లున్నారు. ఎంతకాలం ఇలా ఈ ఎంపిని భరించాలో ఏమో.